Advertisement
Bhagavanth Kesari Review in Telugu: నందమూరి అభిమానులు, బాలయ్య బాబు ఫాన్స్, మాత్రమే కాదు యావత్ సినీలోకం కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు, మొత్తానికి ఈ రోజు రానే వచ్చింది. మాస్ క్యారెక్టర్ లో పవర్ ఫుల్ రోల్ పోషించిన బాలయ్య బాబు “భగవంత్ కేసరి” రివ్యూ ఎలా ఉందొ ఇప్పుడు చూసేద్దాం.!
Advertisement
మరి ఆకట్టుకున్నాడా లేదా ? సినిమా స్టోరీ ఏంటంటే ?భగవంత్ కేసరి సినిమాలో నందమూరి బాలకృష్ణ,కాజల్ అగర్వాల్, శ్రీలీలా, అర్జున్ రాంపాల్ తదితరులు నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మించారు. థమన్ సంగీతాన్ని అందించారు.
Read More: Bhagavanth Kesari Dialogues in Telugu
చిత్రం : భగవంత్ కేసరి
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలా, అర్జున్ రాంపాల్ తదితరులు
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం : థమన్
విడుదల తేదీ : అక్టోబర్ 19, 2023
భగవంత్ కేసరి కథ మరియు వివరణ:
ఇక కథ విషయానికి వస్తే.. భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) ఆదిలాబాద్ నుండి వచ్చిన అతను. జైల్లో వున్నప్పుడు అక్కడున్న ప్రిజనర్ కూతురు అయిన విజ్జి (శ్రీ లీల) ని పెంచుతాడు. విజ్జి బాధ్యతలు ని భగవంత్ కేసరి కొన్ని కారణాల వలన తీసుకోవాల్సి ఉంటుంది. కాత్యాయని (కాజల్ అగర్వాల్) మానసిక వైద్యురాలు. పొలిటీషియన్ కొడుకు అయిన సంఘ్వీ (అర్జున్ రాంపాల్) ఏమో బిజినెస్ మ్యాన్. ప్రపంచంలోనే తాను అందరికంటే గొప్ప వ్యక్తి అవ్వాలని అనుకుంటాడు. విజ్జిని ఆర్మీలోకి పంపించి ధైర్యవంతురాలుగా మార్చాలని అనుకుంటాడు.
Advertisement
సంఘ్వీకి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి మధ్య తెలియకుండా ఒక సంఘటనలో విజ్జి స్ట్రక్ అవుతుంది. దీనిలో నుండి విజ్జీ ఎలా వస్తుంది..? అందుకు భగవంత్ కేసరి ఏం చేశాడు? అసలు భగవంత్ కేసరికి, సంఘ్వీకి మధ్య గొడవ ఏమిటి..? ఇవి తెలియాలంటే మూవీ చూడాలి. హీరోగా నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించాడు. ఈ స్టోరీ ఏమి కూడా పెద్ద గొప్ప కథ ఏమీ కాదు. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగ ఉండే స్టోరీ ఇది. ఇక రెండవ పార్ట్ లో మాత్రం మంచి మెసేజ్ ఇచ్చారు.
బాలకృష్ణ గురించి పక్కన పెడితే, శ్రీలీల పాత్ర కూడా అదిరిపోయింది. ఈ మూవీ లో శ్రీలీలకి, బాలకృష్ణకి మధ్య ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. థమన్ సాంగ్స్ కూడా బావున్నాయి. కానీ కొత్తదనం లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఎలివేట్ చేసేలా లేదు కానీ సినిమాకి సూట్ అయింది.
ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ రోల్
ఎమోషనల్ సీన్స్
సెకండ్ హాఫ్ లో మంచి మెసేజ్
సినిమా కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్:
అనవసరమైన లవ్ ట్రాక్
రొటీన్ గా సాగే స్టోరీ
కొన్ని కామెడీ సీన్స్
సాగదీత సన్నివేశాలు
రేటింగ్ : 3/5
Also read: Bhagavanth Kesari: Heroine, Name, Cast, Crew and Remuneration details