Advertisement
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఏనాడు కూడా స్పందించలేదు. వాస్తవానికి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు వేదికలపై ప్రజల సభలో కానీ, మాట్లాడింది లేదు. కానీ తాజాగా భర్త జైలుకు వెళ్లడంతో ఆమె గడప దాటారు. ఆలయాలు, ప్రార్థన మందిరాల వద్దకు వెళ్లారు. పూజలు, ప్రార్థనలు చేశారు. తన భర్త గురించి ప్రెస్ మీట్స్ పెడుతున్నారు.
Advertisement
Read More : కేసీఆర్, ఎన్టీఆర్ లే మంచి సీఎంలు… మిగతా అందరూ బ్రోకర్లే.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి!
ఈ తరుణంలో ఆమె భర్త అవినీతి పరుడు కాదని.. చెప్పే ప్రయత్నంలో చంద్రబాబును రాజకీయ కక్షతో అరెస్ట్ చేసి జైలులో వేశారని పలు సందర్భాల్లో ఆరోపించారు. తమ కుటుంబం ప్రజా సేవకే అంకితమైందని.. చంద్రబాబు జైలులో ఉన్నా కూడా ప్రజల గురించే ఆలోచిస్తారని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజల సొమ్ము తమకు వద్దని తెలిపారు. హెరిటేజ్ లోని తన వాటాలో కేవలం రెండు శాతాన్ని అమ్మితేనే క్షణంలో రూ.400 కోట్లకు పైగా వస్తాయని.. అలాంటి తమకు ప్రజల సొమ్ము ఎందుకు?
అని ప్రశ్నించారు. వాస్తవానికి హెరిటేజ్ లో భువనేశ్వరికి 39.6 శాతం వాటా ఉందని.. ఈ లెక్కన భువనేశ్వరి వాటాను పూర్తిగా ఆమె చెప్పిన ప్రకారం.. లెక్కలేస్తే.. ఆమె సంపాదన సుమారు రూ.15వేల కోట్ల వరకు ఉంటుంది. మరోవైపు భువనేశ్వరి ఆమె తెలిసి మాట్లాడారో.. ప్రజల డబ్బు తమకు అవసరం లేదని.. చెప్పడానికి మాట్లాడారో కానీ మొత్తానికి ఆమె తన ఆస్తుల లెక్క బయటికి చెప్పేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి: లోకేష్ ను అరెస్ట్ చేస్తారా? ముందస్తు బెయిల్ పిటిషన్ వెయ్యడానికి కారణం ఏమిటి?
భువనేశ్వరి చెప్పిన మాటలు ఇప్పుడు టీడీపీకి పెద్ద తలనొప్పిని తెచ్చేవిధంగా కనిపిస్తున్నాయి. భువనేశ్వరి ప్రకటన అధికార వైసీపీకి అస్త్రంగా మారింది. ముఖ్యంగా 2 శాతం వాటా అమ్మితే రూ.400 కోట్లు వస్తున్నప్పుడు.. మొత్తం వాటా విలువ ఎన్నివేల కోట్లు..? ఇది ఎలా సంపాదించారు ? ఇది అక్రమార్జన కాదా అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
భువనేశ్వరి వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కౌంటర్ కూడా ఇచ్చారు. హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్పారు. ఈ లెక్కన మీ ఆస్తుల విలువ రూ.20వేల కోట్లు.. చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించిన ఆస్తి ఎంత ? అని ప్రశ్నించారు. రెండు ఎకరాల నుంచి రూ.20వేల కోట్లకు మీ ఆస్తులు ఎలా పెరిగాయి అంటూ నిలదీశారు. ఒకప్పుడు చంద్రబాబు ఆస్తి ఎంత..? ఇప్పుడు ఎంత ? అని ప్రశ్నించారు. ప్రధానంగా పాలు అమ్మితినే రూ.20వేల కోట్లు వచ్చాయా? అంటూ భువనేశ్వరిని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కళ్యాణి. ప్రస్తుతం సోషల్ మీడియాలో భువనేశ్వరి చేసిన కామెంట్స్ తెగ వైరల్ కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి: ఈసారి 175 స్థానాల్లోనూ వైసీపీ గెలిచి చూపిస్తుందా? జగన్ ధీమా వెనుక అసలు కారణం ఏంటి?