Advertisement
టీమిండియా బెస్ట్ స్వింగ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకరు. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టినప్పుడు తొలి బంతికే వికెట్ తీసి తన ఎంట్రీని ఇచ్చాడు. నకుల్ బాల్ తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు కూడా. ఐపీఎల్ లో కూడా ఈ స్వింగ్ బౌలర్ ప్రదర్శన ఎలా ఉంటుదనేది మనం చూసాం. నాణ్యమైన బౌలింగ్ తో ఎప్పుడూ పర్పుల్ క్యాప్ రేస్ లో ఉంటాడు భువి. ఇది ఇలా ఉంటే భువనేశ్వర్ తాజాగా తన రిటైర్మెంట్ గురించి అయితే హింట్ ఇచ్చాడు.
Advertisement
Advertisement
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో క్రికెటర్ అనే పదాన్ని తీసేసాడు. ఇది వరకైతే భువనేశ్వర్ ఇంస్టాగ్రామ్ బయోలో ‘ఇండియన్ క్రికెటర్’ అనుండేది. అయితే ప్రస్తుతం ఆ పదాన్ని తొలగించి ‘ఇండియన్, ఫ్యామిలీ ఫస్ట్, పెట్ లవర్, కాజువల్ గేమర్’ మాత్రమే ఉంచాడు. 2022 జనవరి లో భారత్ తరఫున చివరి వన్డే ఆడాడు. 21 టెస్టుల్లో 61 వికెట్లు,117 వన్డేల్లో 132 వికెట్లు, 48 టీ20ల్లో 49 వికెట్లు పడగొట్టేసాడు.
Also read:
- రాజశేఖర్ ని ఇమిటేట్ చేసిన చిరు.. వీడియో వైరల్..!
- “బ్రో” లాగా ఒకే అక్షరంతో తెరకెక్కి సూపర్ హిట్ అయిన.. మూవీస్ ఇవే..!
- బ్రో మూవీ లో ఏపీ మంత్రి డాన్స్‌తో పాటు.. సీఎం పై పవన్ కళ్యాణ్ సెటైర్స్.. వైరల్..!