Advertisement
Bichagadu 2 Review Telugu: పరిచయం: విజయ్ ఆంటోని హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. 2016లో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ సీక్వెల్ ను తెరకెక్కించాడు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వం వహించారు. అదేవిధంగా ఎడిటింగ్, మ్యూజిక్ కూడా అతడే అందించాడు. సినిమాను విజయ్ సతీమణి ఫాతిమా ఆంటోనీ నిర్మించారు. సినిమాలో విజయ్ కి జోడిగా హీరోయిన్ కావ్య తప్పర్ నటించింది. బిచ్చగాడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన బిచ్చగాడు 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉంది…? ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
Advertisement
ALSO READ :చైల్డ్ ఆర్టిస్టులుగా అదరగొట్టిన ఈ 10 మంది నటులు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..!!
Bichagadu 2 Story కథ కథనం :
బిచ్చగాడు 2 యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. సినిమాలో విజయ్ ఆంటోనీ విజయ్ గురుమూర్తి అనే పాత్రలో నటించాడు. ఇండియాలోని ఏడుగురు ధనవంతుల్లో విజయ్ గురుమూర్తి ఒకరు. అయితే విజయ్ గురుమూర్తి బ్రెయిన్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. సత్య అనే వ్యక్తి బ్రెయిన్ ను విజయ్ గురుమూర్తికి అమరుస్తారు. దాంతో విజయ గురుమూర్తి సత్య ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లోకి వెళ్లిపోతాడు విజయ్ పూర్తిగా సత్య ల ఆలోచించడం మొదలుపెడతాడు.
Advertisement
మొదటి గంట సేపు సినిమా అసలు బోర్ కొట్టదు. ఫస్టాఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను సీట్ లో కూర్చోబెట్టింది. ఇంట్రెస్టింగ్ ట్విస్టుతో ఫస్ట్ ఆఫ్ పూర్తవుతుంది సెకండ్ హాఫ్ విజయ్ గురుమూర్తి నిత్యావసరాల వస్తువులను తయారు చేసి తక్కువ ధరకు అమ్మాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. మంచి చేయాలని భావించిన విజయ్ గురుమూర్తికి నష్టం ఎలా జరిగింది అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ :
ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే… మొదట ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సినిమా స్టార్ట్ అయింది. కానీ చివరికి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మారిపోయింది. అయితే సినిమాలో కొన్ని సీన్లు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలి. కానీ ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకునే మెసేజ్ ను సరిగ్గా కన్వే చేయలేకపోయాడు. సినిమా క్లైమాక్స్ ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది. నటీనటుల పెర్ఫామెన్స్ బాగుంది. మ్యూజిక్.. ఎడిటింగ్ కూడా ఓకే..ఇక ఈ సినిమాను కచ్చితంగా ఒకసారి థియేటర్ లో చూడవచ్చు.