Advertisement
ఇప్పటి వరకు బిగ్ బాస్ 7 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 8వ సీజన్లోకి అడుగు పెట్టబోతోంది. ఏడవ సీజన్లో పల్లవి ప్రశాంత్ సంచలనాన్ని సృష్టించాడు. కామన్ మ్యాన్ క్యాటగిరీలో హౌస్ లోకి వచ్చి అన్ని విధాలుగా తన సత్తా చాటి కప్పు కొట్టాడు. టాస్కుల్లో విజృంభించాడు. మాట తీరు ప్రవర్తన ప్రతి దాంట్లో ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. కామనర్ అయినప్పటికీ సెలబ్రిటీలను వెనక్కి నెట్టి టైటిల్ ని గెలుచుకున్నాడు బిగ్ బాస్ చరిత్రలో రికార్డుని క్రియేట్ చేశాడు. ఇంతవరకు బానే ఉంది కానీ ఫినాలే ముగిసిన తర్వాత రచ్చ మొదలు పెట్టాడు.
Advertisement
పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ దాడులకు దిగారు దారుణంగా కొట్టుకున్నారు. ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ కారుని అడ్డుకున్నారు. వారిపై రాళ్ల దాడి చేశారు. అంతే కాదు మిగిలిన కంటెస్టెంట్ల కార్లు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టేసారు. దీంతో పల్లవి ప్రశాంత్ కి పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి హంగామా చేయకుండా సైలెంట్ గా వెనుక నుండి వెళ్లిపోమని సూచించారు. కానీ పల్లవి ప్రశాంత్ పోలీసులు మాటల్ని లెక్క చేయలేదు. పరిస్థితి అదుపుతప్పింది.
Advertisement
Also read:
పోలీసులు పల్లవి అతని సోదరుడిపై కేసులను నమోదు చేశారు. అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. రెండు రోజులకు బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ సంఘటన వలన బిగ్ బాస్ ఇమేజ్ డామేజ్ అయింది. షో పేరు దెబ్బతింది. అయితే అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై సామాన్యుల్ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకు వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!