Advertisement
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
Advertisement
దీంతో ఏపీలో ఊహించని విధంగా రాజకీయాలు మలుపు తిరిగాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడినట్టయింది. ప్రస్తుతం లోకేష్ తండ్రిని జైలు నుంచి బయటికీ తీసుకొచ్చే పనిలో పడ్డారు. కానీ మరోవైపు లోకేష్ కూడా జైలుకు వెళ్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవి చదవండి: Jr NTR: చంద్రబాబు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలుసా ?
ఇవి చదవండి: ఎన్టీయార్ బాలయ్య మధ్య గొడవకి కొడాలి నాని కి ఉన్న సంబంధం ఇదేనా ?
ఈ తరుణంలో టీడీపీ బాధ్యతలు ఎవరు భుజాన వేసుకుంటారు ? పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేదెవరు అదనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
చంద్రబాబు అరెస్ట్ పై కూడా స్పందించడం లేదు. దీంతో ఎన్టీఆర్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు బాలయ్య పార్టీని నడిపిస్తారనుకుంటే.. అది అంత ఈజీ కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Advertisement
ప్రస్తుతం అందరి నోటా ఒకే మాట.. అదే నారా భువనేశ్వరి పేరు వినిపిస్తోంది. నారా వారి కోడలు.. నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణికి రాజకీయాల్లోకి వచ్చేందుకు అన్ని అర్హతలున్నాయని చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ మనవరాలిగా, చంద్రబాబు కోడలిగా పార్టీని ముందుండి నడిపించే అన్ని అర్హతలు బ్రాహ్మణికి ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తరువాత మొదటి సారి మీడియా ముందుకొచ్చి పాలిటిక్స్ మాట్లాడిన బ్రాహ్మణి..
ఎన్నికల వరకు పార్టీని నడిపించే బాధ్యత తీసుకుంటారనేది ప్రచారం జోరుగా సాగుతోంది.త్వరలోనే బ్రహ్మాణి పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేపట్టే అవకాశం కూడా కనిపిస్తోంది.
మరోవైపు లోకేష్ కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందని ఇటీవలే బ్రాహ్మణి ప్రకటించిన విషయం విధితమే. బ్రాహ్మణి కనుక రాజకీయాల్లోకి వస్తే.. నందమూరి కుటుంబం సెంటిమెంట్ బ్రాహ్మణికి బాగానే కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఏం జరుగుతుందనేది కొద్ది రోజులు వేచి చూడాలి మరీ.
ఇవి చదవండి: చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్..!