Advertisement
గేమింగ్ యాప్ లో పరిచయం అయిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు తమ దేశ సరిహద్దు దాటిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక ఈసారి సినిమాల్లో నటించి స్టార్ డమ్ కొట్టాలని ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో ఓ మూవీలో నటించేందుకు ఆడిషన్ కి కూడా వెళ్లినట్టు సమాచారం. ఉదయ్ పూర్ టైర్ హత్యోదంతం కథాంశంగా హిందీలో రూపొందించనున్న “ఏ టైలర్ మ*ర్ స్టోరీ” పేరుతో రూ.25కోట్ల నుంచి రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Advertisement
ఈ మూవీ ఉదయ్ పూర్ కన్హయ్య లాల్ ని ఇస్లామిక్ రాడికల్స్ Ha త్య చేసిన కథ ఆధారంగా రూపొందిస్తున్నారు. జానీ ఫైర్ పాక్స్ ప్రొడక్షన్స్ ఈ సినిమాలో నటించడానికీ సీమా ఆడిషన్ సమయంలో ఇద్దరూ దర్శకులు ఉన్నారట. ఈ చిత్రంలో రా ఆఫీసర్ పాత్రలో సీమా కనిపించనున్నట్టు వార్తలు వినిపించాయి. ఉత్తరప్రదేశ్ లోని ఏటీఎస్ సీమాను విచారిస్తోంది. పోలీసుల నుంచి క్లీన్ చిట్ పొందిన తరువాత ఈ మూవీని ఆఫర్ ని అంగీకరిస్తానని సీమా చెప్పినట్టు సమాచారం. సీమా హైదర్ పాకిస్తానీ మహిళ.
Advertisement
గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తున్న 22 ఏళ్ల సచిన్ మీనా అనే వ్యక్తితో కరోనా మహమ్మారి సమయంలో పబ్ జీ గేమ్ ద్వారా పరిచయం ఏర్పడింది. సీమాకి గులాం హైదర్ అనే వ్యక్తితో పెళ్లి జరిగి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రియుడిని పెళ్లాడటానికి నలుగురు పిల్లలతో సహా దేశ సరిహద్దును దాటి భారత్ లోకి ప్రవేశించింది. ఆమె సోదరుడికి పాక్ సైన్యంతో సంబంధం ఉన్నట్టు ఆమె భర్త ఇటీవల మీడియాకు వివరించాడు. ప్రస్తుతం ఆమె బెయిల్ పై విడుదలై ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటొంది. ఆమెను ఇటీవల సినీ దర్శకులు సంప్రదించి సినిమా ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం.