Advertisement
దేశవ్యాప్తంగా బుల్లితెర షో లలో రియాలిటీ షో గా బిగ్ బాస్ మొదటి స్థానంలో ఉంటుంది… ఇప్పటికే ఈ షో రికార్డు స్థాయిలో రేటింగ్ లను అందుకుంటూ ముందుకు వెళుతోంది.. రెండో వారం ముగిసే సమయం దగ్గరికి వచ్చిన కొద్దీ హౌస్ లో కంటెస్టెంట్ ల పర్ఫామెన్స్ రకరకాలుగా ఉంటుంది. ఈసారి బిగ్ బాస్ ఆరంభంలోనే ఎన్నో ఎమోషన్స్ కనిపిస్తున్నాయి.. ఈ తరుణంలో నటి సుదీప (పింకీ) కన్నీరు పెడుతూ ఒక విషయాన్ని చెబుతూ అందరినీ ఆవేదనకు గురి చేసింది.. అది ఏంటో ఇప్పుడు చూద్దాం..? బిగ్ బాస్ రెండవ వారంలో జరిగిన సిసింద్రీ టాస్క్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఒక బొమ్మని ఇచ్చి వారి కూతురు లేదా కొడుకుగా చూసుకోవాలని చెప్పారు.. దీంతో కంటెస్టెంట్ లు ఆ బొమ్మలతో ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకున్నారు..
Advertisement
ALSO READ;రీల్ లైఫ్ లో కలిసి నటించి రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్న జంటలు..ఎవరంటే..?
అందుకే టాస్క్ ముగిసిన తర్వాత కూడా ఆ బొమ్మలు ఇచ్చేందుకు చాలా ఇబ్బంది పడ్డారు.. దీంతో బిగ్ బాస్ గురువారం జరిగినటువంటి ఎపిసోడ్ లో వాళ్లకి మరో టాస్క్ ను ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతీ కంటెస్టెంట్ వారి నిజ జీవితంలో బేబీ ల తో ఉన్న బంధాన్ని చెప్పాలని అన్నారు.. దీనికి సుదీప పింకీ చాలా రియాక్ట్ అయ్యారు.. కన్నీళ్లు పెడుతూ మాట్లాడారు.. దేవుడు నాకు అన్నీ ఉన్నాయని, పొగరు ఎక్కువైపోతుంది అని అనుకున్నాడో ఏమో కానీ.. 2015 లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఆ సమయంలో నేను పిల్లల్ని కనడానికి రెడీగా లేనని అనుకున్నాను. కానీ అందరూ ఒత్తిడి చేసే సరికి వదులుకోకూడదని అనుకున్నా అని చెప్పింది.
Advertisement
నా గర్భంలో బిడ్డ పెరుగుతూ వచ్చింది నేను మాట్లాడడం కూడా స్టార్ట్ చేశాను. ఆస్పత్రికి వెళ్లి బేబీ హార్ట్ బీట్ కూడా విన్నాను.. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో నాకు థైరాయిడ్ ఎక్కువైపోయి, దాన్ని గమనించక పోవడంతో నా బిడ్డను కోల్పోయాను అంటూ ఎమోషనల్ అయ్యింది. ఆ సమయంలో మా చెల్లి కూతురు రావడంతో చాలా దగ్గరయ్యాను.. కానీ మా ఆయన మాత్రం వాళ్ల పిల్లని ఎప్పుడైనా మనం ఇచ్చేయాలని అనేవాడు.. ఇప్పుడు ఈ చిన్న బొమ్మను ఇవ్వాలంటేనే నాకు మనసు రావడం లేదు.. కానీ వాళ్ల కూతుర్ని వాళ్ళకి ఇవ్వడానికి నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది.. జీవితంలో సుదీప తల్లి అవుతుందని అనుకుంటున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కంటెస్టెంట్ పింకీ..
ALSO READ;చిరంజీవి – విజయశాంతి జోడి…ఎందుకంత స్పెషల్.. వాళ్లు చేసిన 10 బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ !