Advertisement
బిగ్ బాస్ సిట్యుయేషన్ వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత దారుణంగా మారిపోయింది. ఎర్రగడ్డ హాస్పిటల్ అంటూ ఇంతకుముందు ప్రేక్షకులు తీవ్ర విమర్శలు చేశారు. వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత హౌస్ లో మెంటల్ కేసులు ఎక్కువైపోయాయని వైజాగ్ పిచ్చి హాస్పిటల్ నుంచి కొంత మందిని పట్టుకొచ్చి హౌస్ లో పడేసిన పరిస్థితి వచ్చిందని ఆడియన్స్ అంటున్నారు. ఈసారి సీజన్లో ముందుకు వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఏ ఒక్కరు కూడా గేమ్ ని రక్త కట్టించలేకపోతున్నారు. బిగ్ బాస్ ఇది వరకు సీజన్ల కంటెస్టెంట్లను మళ్ళీ తీసుకొచ్చి హౌస్ మొత్తం దింపేశారు వీళ్ళు ఆట ఆడటానికి బదులుగా చిరాకు పుట్టించేస్తున్నారు.
Advertisement
Advertisement
టేస్టీ తేజ హౌస్ లోకి వచ్చిన తర్వాత అందులో ఉన్న కంటెస్టెంట్లతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నాయని పావని నిన్ను బయట అందరూ బండబూతులు తిడుతున్నారని అన్నాడు. దీంతో ఆమె ఫుల్లుగా ఏడ్చేసింది. టేస్టీ తేజ కూడా అనవసరంగా ఆమెకి ఈ మాట చెప్పాను అని డిసప్పాయింట్ అయిపోయాడు. నవ్వకుండా ఉండండి పేరుతో చేసిన అవినాష్ కామెడీ పంచలతో అందరినీ నవ్వించి ఓడించడానికి ప్రయత్నం చేశాడు.
Also read:
గౌతమ్ కృష్ణను అశ్వద్ధామ 2.0 అని అనడంతో గౌతమ్ నన్ను ఇరిటేట్ చేయొద్దు అని రచ్చ రచ్చ చేశాడు. అవినాష్ ఇక్కడ అతన్ని ఏమీ అనలేదు కానీ గౌతమ్ ని బ్యాలెన్స్ ని కోల్పోయి పిచ్చిపిచ్చిగా చూసాడు. బిగ్ బాస్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బిగ్ బాస్ ని తిట్టాడని అతని ఆజ్ఞను ధిక్కరించాడని అభయ్, నవీన్ ని హైలెట్ చేశారు గౌతమ్ విషయంలో మాత్రం ఎలాంటి చర్య తీసుకోకపోవడం చాలా వింతగా ఉందని ఆడియన్స్ అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!