Advertisement
పల్లవి ప్రశాంత్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రైతుబిడ్డ అనే ట్యాగ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ ఇవ్వక ముందు సోషల్ మీడియా ద్వారా బానే పాపులారిటీని సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చాక ఇంకా పాపులర్ అయిపోయాడు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినప్పటికీ ఏకంగా కప్ ని ఎగరేసుకు వెళ్లిపోయాడు.
Advertisement
pallavi prasanth
బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు. ట్రాఫీ ని గెలిచిన తర్వాత ఊహించని పరిణామాలతో జైలుకి వెళ్లాల్సి వచ్చింది సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనపడే ప్రశాంత్ తాజాగా స్టార్ మా అవార్డ్స్ లో మెరిసాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో అని స్టార్ మా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
Advertisement
Pallavi Prashanth’s grand entry at the Star Maa Parivaar Awards! 🌟✨ His energy and grace will leave everyone in awe, setting the stage on fire with his powerful presence. Coming soon only on #StarMaa! 🌟 #StarMaaParivaarAwards2024 #SMPA2024 pic.twitter.com/5Lkrminsn9
— Starmaa (@StarMaa) October 15, 2024
స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో పల్లవి ప్రశాంత్ గ్రాండ్ ఎంట్రీ వీడియోని రిలీజ్ చేసింది. పుష్ప స్టైల్ లో కనపడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. గడ్డంతో పుష్ప మినరీజాన్ని ఇమిటేట్ చేసాడు. ఈ వేడుక త్వరలోనే స్టార్ మా లో ప్రసారం కాబోతోంది దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనికి రకరకాలుగా నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!