Advertisement
స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. దీనితో టీడీపీ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఆయన లేకుంటే పార్టీని సమర్ధవంతంగా నడిపించగలిగే నాయకుడు టీడీపీ వర్గాల్లో కనిపించడం లేదు. మరి కొన్ని రోజుల్లో లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్ గురించి టీడీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది.
Advertisement
చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కేసు తీవ్రతరం అర్ధం అయ్యేసరికి టీడీపీ వర్గాల్లో ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికలు మరో ఎనిమిది నెలల్లో ఉన్న తరుణంలో నాయకుడు అరెస్ట్ కావడంతో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అయితే.. ప్రస్తుతం టీడీపీ ఇలా ఉండడానికి చంద్రబాబు నాయుడు కూడా ఓ కారణం అని భావిస్తున్నారు. ఆయన మొదటి నుంచి పార్టీ పగ్గాలను ఎవ్వరికీ ఇవ్వలేదు. బాలకృష్ణ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయన పార్టీని నడిపించగల సమర్ధత కలిగి ఉన్నట్లు అనిపించలేదు.
Advertisement
సినిమాల్లో డైలాగ్స్ చెప్పినట్లు రాజకీయం ఉండదు అని ఆయన గుర్తించాలన్న అభిప్రాయం టీడీపీ వర్గాలలో ఉంది. ఇక లోకేష్ కూడా పూర్తిస్థాయి రాజకీయ పరిపక్వత పొందినట్లు లేదు. పార్టీలో చంద్రబాబు నాయుడుకు సమకాలీకులు ఉన్నప్పటికీ.. వారిని కేవలం వారి పదవులకి మాత్రమే చంద్రబాబు నాయుడు పరిమితం చేసారు. వారిలో ఎవరినైనా నమ్మి పార్టీ బాధ్యతలను ఎప్పుడైనా అప్పగించినా.. ఈరోజు పార్టీ ఈ పరిస్థితిలో ఉండేది కాదేమోనన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతోంది. దీనితో.. నేటి టీడీపీ పరిస్థితికి చంద్రబాబు తప్పిదం కూడా ఓ కారణమన్న భావన తలెత్తుతోంది. మరోవైపు వైసీపీ కూడా టైం చూసి దెబ్బకొట్టింది. దీని నుంచి టీడీపీ ఎలా బయటపడుతుందో చూడాలి.
మరిన్ని..
లోకేష్ అరెస్ట్ కి రంగం సిద్దమైందా? బరిలోకి దిగనున్న బ్రాహ్మణి?
మొదటి సారి CBN అరెస్ట్ పై స్పందించిన రేవంత్ ! KTR కు ఇచ్చిన కౌంటర్ మాములుగా లేదుగా !
స్కంద సినిమాకు అదే మైనస్ అయ్యిందా? లేకుండా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకునేదా?