Advertisement
చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యానికి సాళువ తిమ్మరుసు మంత్రిగా ఉండేవారు. ఆయన్ని శ్రీకృష్ణ దేవరాయలు అప్పాజీ అంటూ ముద్దుగా పిలిచేవారు. శ్రీకృష్ణ దేవరాయల సవతి సోదరుడు అయిన రాజు తుళువ నర్సింహ రాయల మరణించిన తర్వాత అప్పాజీ రాయలను రాజును చేశారు. అయితే అనారోగ్యంతో ఉన్నటువంటి రాజు తుళువ నర్సింహ రాయలు తన చిన్న కొడుకుని రాజును చేయాలనే ఉద్దేశ్యంతో కృష్ణదేవ రాయలను అంధుడిగా చేయమని తిమ్మరుసుకు చెబుతారు. ప్రధాన మంత్రి అయిన తిమ్మరుసు రాజు అనంతరం సమర్ధుడైన పాలకుడిగా కృష్ణరాయలను భావించి, మేక కళ్ళను తెచ్చి రాజుకు కృష్ణరాయల కళ్ళుగా చూపిస్తాడు. వాటిని చూసి సంతృప్తి చెందిన రాజు ప్రశాంతంగా చనిపోతాడు. ఆ తర్వాత తిమ్మరుసు కృష్ణదేవరాయల చక్రవర్తిగా చేశారు. అప్పాజీ సాయంతో కృష్ణదేవరాయలు గొప్ప చక్రవర్తిగా ఎదిగాడు. విజయనగర సామ్రాజ్యా యొక్క కీర్తిని పలు దిశలలో చాటుతూ, గొప్ప చక్రవర్తిగా పేరు పొందాడు.శ్రీకృష్ణ దేవరాయలకు చిన్నాదేవి, తిరుమల దేవి, అనే ఇద్దరు భార్యలు ఉండేవారు.
Advertisement
ఆ తర్వాత యుద్దంలో ప్రతాపరుద్ర గజపతిని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవిని మూడవ భార్యగా చేసుకుంటాడు. ఈమెను చాలామంది లక్ష్మీదేవి, జగన్మోహిని అని కూడా పిలిచేవారు. విజయనగరానికి లక్ష్మీదేవితో పాటుగా ఆమె పినతండ్రి కూడా రావడం జరుగుతుంది. బహుమనీ సుల్తానులు విజయనగరం మీదకు దండేత్తిన టైం లో విజయనగర సామ్రాజ్యం గజపతులకు దక్కాలనే కుట్రతో లక్ష్మీ పినతండ్రి ఒక ఆలోచన చేస్తాడు. అతను అనుకున్నది జరగాలి అంటే మహా మంత్రి తిమ్మారుసును రాజ్యానికి దూరం చేయాలని భావిస్తాడు. అతని తెలివితోనే విజయనగర సామ్రాజ్యం గొప్పగా మారిందని గ్రహించి, రాయలకు తిమ్మారుసును దూరం చేయాలని భావిస్తాడు. దానిలో భాగంగా రాయల యుద్ధానికి వెళ్లే ముందు కుమారుడు తిరుమల రాయలకు పట్టాభిషేకం చేయలని కుమార్తె లక్ష్మితో చెప్పిస్తాడు. అప్పాజీని అడిగి నిర్ణయం తీసుకుందామని చెప్పినా కానీ వినకుండా పదే పదే అడగడంతో కుమారుని పట్టాభిషేకానికి రాయలు ముహూర్తం ఫిక్స్ చేస్తాడు.అయితే తిమ్మరుసు మీద రాజద్రోహ ముద్ర వేయడం కొరకు గజపతుల నుండి విషం తెప్పించి, పట్టాభిషేకానికి ముందే చిన్నపిల్లవాడైన తిరుమల రాయలకు విషాన్ని తాగించి, ఆ పిల్లడిని తిమ్మరుసు ఉన్న ప్రాంతంలో వదలగా, బాధతో ఆరుస్తున్నటువంటీ తిరుమల రాయలను ఎత్తుకొని రాయల మందిరం లోనికి తీసుకెళ్తాడు.
Advertisement
కానీ ఆ లోపే తిరుమల రాయలు మరణిస్తాడు. అప్పుడే లక్ష్మీ పినతండ్రి తిరుమల రాయలను చంపింది తిమ్మారుసు అంటూ చెప్పడంతో రాయల కోపంతో ఆ విధంగా చెప్పడానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతారు. తిమ్మారుసుకి గజపతులు అంటే పగ అనే విషయం మీకు తెలుసు. లక్ష్మీ కుమారుడు రాజు కావటం ఇష్టం లేకపోవడం వల్లే చంపాడని చెప్తాడు. మిమ్మల్ని చంపానని చెప్పి, తరువాత రాజును ఎలా చేశారో, ఆ విధంగా మీ కొడుకుని చంపి మీ తమ్ముడు అచ్యుత రాయలును రాజును చేయాలనుకున్నాడని అంటారు. కొడుకు చనిపోయిన బాధలో ఉన్నటువంటి రాయలు దాన్ని నమ్మి తిమ్మారుసును బంధించమని, అది రాజద్రోహంగానే భావించి తనను పెంచి పెద్ద చేసిన తిమ్మరుసు 2 కళ్ళు పొడిచేయమని ఆదేశిస్తాడు. అయితే కొంత కాలానికి గజపతుల వలన ఇది జరిగిందని తెలుసుకున్న తిమ్మారుసుని క్షమించమని రాజ్యానికి తీసుకురాగా, ఆయన ఇంకా మంత్రిగా ఉండలేనని తిరుపతికి వెళ్ళి చివరి రోజులు అక్కడే గడిపాడని శాసనాల ద్వారా తెలుపబడింది. ఇలా గొప్ప చక్రవరి అయిన శ్రీకృష్ణ దేవరాయలు జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటని అంటారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు: