Advertisement
Bimbisara Movie Review: టాలీవుడ్ స్టార్ హీరో కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత మూవీ బింబిసార తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో, టైం ట్రావెల్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాల నడుమ నేడు విడుదల అయింది. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ మూవీని నిర్మించారు.
Advertisement
Bimbisara Movie Review: కథ మరియు వివరణ:
త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ రామ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్రీస్తుపూర్వం 500 ఏళ్ల నాటి గొప్ప రాజుకు సంబంధించిన కథ ఇది. ఆ కాలంలో అతనికి ఎదురు లేదు. కాల ప్రవాహంలో బింబిసారుడు కలిసి పోతాడు. ఆ తర్వాత అదే బింబిసారుడు డిజిటల్ కలియుగంలో మళ్ళీ పుడతాడు. అయితే అతని గతం వెంటాడుతూ ఉంటుంది. అలా కాలంతో పాటు వెనక్కి ప్రయాణిస్తాడు. ప్రస్తుత ప్రపంచంలోకి వచ్చి మరి తనకు సంబంధించిన నిధిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు బింబిసారుడు. వరుస ప్లాప్ లతో సతమతమైన కళ్యాణ్ రామ్ కు ఇది టఫ్ టైం అనే చెప్పాలి. ఎప్పటి నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కు ఇదో కొత్త మలుపు అని చెప్పవచ్చు.
Advertisement
కళ్యాణ్ రామ్ బింబిసార రివ్యూ!
బింబిసార రోల్ అత్యద్భుతమని చెప్పాలి. కానీ, మొదటి భాగంలోనే బింబిసార రోల్ ఎండ్ అయిపోతుంది. సాటి ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. సెకండ్ ఆఫ్ మాత్రం బింబిసార అద్భుతంగా కథను మలుపు తిప్పాడు దర్శకుడు. కొత్తగా అనిపిస్తుంది. బింబిసార లో మరో కోణాన్ని చూపించాడు. ఇదే సినిమాకు పెద్ద హైలెట్ అని చెప్పాలి. హాఫ్ పార్ట్ గ్రాఫిక్స్ తోనే నడుస్తుంది. గ్రాఫిక్స్ పరంగా విజువలైజేషన్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఆడియన్స్ సులభంగా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు పాత్రలకు అవకాశం ఇచ్చాడు.
#ప్లస్ పాయింట్స్:
గ్రాఫిక్స్ నందమూరి
కళ్యాణ్ రామ్ యాక్టింగ్
సంగీతం
#మైనస్ పాయింట్స్:
దర్శకుడు వశిష్ట ఎఫర్స్ పెట్టలేదు
సెకండ్ ఆఫ్
#రేటింగ్ – 3/5
REAF ALSO : సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!