Advertisement
రాహుల్ గాంధీ.. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఈమధ్యే భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచారు. అయితే.. యాత్ర సందర్భంగా పలుసార్లు ఆయన పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ఆయనే కొన్ని కీలక విషయాలను బయటపెట్టారు. ఆ సమయంలో తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్స్ కూడా వచ్చాయి. అయితే..యాత్ర ముగిశాక కూడా తనకు పిల్లలు కావాలని ఉందని అన్నారు రాహుల్.
Advertisement
ఓ ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి, పిల్లలపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఐదు పదుల వయసు వచ్చినా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడగ్గా.. ఆ విషయం తనకు కూడా తెలియదని సమాధానమిచ్చారు. పెళ్లి చేసుకోకుండా ఉండటంపై ఒక్కోసారి తనకే విచిత్రంగా అనిపిస్తుందని తెలిపారు. అయితే, తనకు పిల్లలు కావాలని ఉందని మాత్రం చెప్పారు. జోడో యాత్ర సందర్భంగా సరైన అమ్మాయి దొరికితే కచ్చితంగా చేసుకుంటానని రాహుల్ చెప్పారు. అంతేకాదు, తనకు ఎలాంటి అమ్మాయి కావాలో కూడా వివరించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈక్రమంలో రాహుల్ పెళ్లిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.
Advertisement
అయితే.. కర్ణాటక బీజేపీ చీఫ్ నవీన్ కతీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నపుంసకుడని, అందువల్లే ఆయన పెళ్లి చేసుకోవడం లేదని అన్నారు. రాహుల్ మారిటల్ స్టేటస్ ను ప్రశ్నించిన ఈయన.. లోగడ కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రజలు.. రోడ్లు, మురుగు కాలువలు వంటి చిన్నపాటి సమస్యలను ప్రస్తావించే బదులు లవ్ జిహాద్ అంశానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. తమ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు టిప్పు సుల్తాన్, సావర్కర్ అంశాల మధ్యే జరగడం ఖాయమని నవీన్ కతీల్ జోస్యం చెప్పారు.
రాహుల్ పై కతీల్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి నోటి దురుసు గల వారిపై బీజేపీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ నేతపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రిజ్వాన్ అర్షద్ అయితే.. ప్రధాని మోడీ ఎందుకు విడాకులు తీసుకున్నారని ఎదురు ప్రశ్నించారు. కొంతమంది ఆర్ఎస్ఎస్ నేతలు కూడా పెళ్లి చేసుకోకుండా అవివాహితులుగా గడపడం లేదా అని నిలదీశారు. మొత్తానికి రాహుల్ పెళ్లి పంచాయితీ మాత్రం హాట్ హాట్ గా కొనసాగుతోంది.