Advertisement
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కమలనాథులు తెగ ప్రయత్నిస్తున్నారు. కేంద్ర పెద్దల డైరెక్షన్ లో రాష్ట్ర నాయకత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే బండి సంజయ్ సారథ్యంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక ఎన్నికల వరకు ప్రజలకు దగ్గరగా ఉండేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కొన్నింటిని అమల్లోకి కూడా తీసుకొచ్చారు. ముందస్తు ఊహాగానాల నేపథ్యంలోనే బీజేపీ స్పీడ్ పెంచింది. పార్టీ నాయకులు గులాబీ సర్కార్ పై తమదైన రీతిలో విమర్శల దాడి కూడా కొనసాగిస్తున్నారు.
Advertisement
తుంగతుర్తి నియోజకవర్గంలో తపాలా బీమా పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ నేత విజయశాంతి. ఈ మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. ఇది ప్రజా సంక్షేమ పరిపాలన కాదన్నారు. ప్రజలు ఆశించిన తెలంగాణ రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దోపిడీకి గురవుతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Advertisement
మోసకారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు విజయశాంతి. అన్యాయం, అక్రమాలు వెలికి తీసే జర్నలిస్టులపై కూడా దాడులు జరగడం అత్యంత హేయకరమైన చర్య అని మండిపడ్డారు. ఇటీవలే తిరుమలగిరిలో ఓ పత్రికా విలేకరిపై దాడి జరిగిందని.. ఇది క్షమించరానిదన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తూ ముందుకు కదలాలని సూచించారు.
కుటుంబ పాలనలో రాష్ట్రం బందీగా మారి దోపిడీకి గురవుతోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో మంది బలి అయ్యారని గుర్తు చేశారు. అప్పట్లో సిరి సంపదలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందన్నారు. ప్రజా సంక్షేమం బీజేపీ పాలనలోనే సాధ్యమని చెప్పుకొచ్చారు విజయశాంతి.