Advertisement
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. కానీ, కేజ్రీవాల్ మాత్రం తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. లిక్కర్ స్కాం విషయంలో ఇరు పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. ఇదే క్రమంలో ఆప్ నేత సత్యేంద్ర జైన్ కు సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఈ వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా షేర్ చేశారు. తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. అక్కడ ఆప్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ దానికి సాక్ష్యంగా ఈ వీడియోను పోస్ట్ చేశారు.
Advertisement
తీహార్ జైలులో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు రాచ మర్యాదలు అంటూ వీడియో వైరల్ అవుతోంది. జైలులో ఆయన మసాజ్ చేయించుకుంటున్నారని.. జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం అవుతున్నాయి. అంతకుముందు జైల్లో సత్యేంద్ర జైన్ కు వీఐపీ ట్రీట్ మెంట్ లభిస్తోందని కోర్టుకు తెలిపింది ఈడీ. కానీ, ఈ వార్తలను తీహార్ జైలు సూపరింటెండెంట్ ఖండించారు. అయితే.. సడెన్ గా వీడియో బయటకు రావడంతో హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
వీడియోలో సత్యేంద్ర జైన్ ఓ వ్యక్తితో మసాజ్ చేయించుకుంటూ కనిపిస్తున్నారు. అయితే.. ఆప్ వాదన మరోలా ఉంది. జైన్ మసాజ్ చేయించుకోలేదని డిప్యూటీ సీఎం సిసోడియా స్పష్టం చేశారు. ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నారని ఈ క్రమంలోనే వైద్యులు ఫిజియో థెరపీ చేశారని వెల్లడించారు. అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకుంటున్న వీడియోను బీజేపీ నేతలు లీక్ చేశారని అన్నారు.
అసత్య ప్రచారాలతో బీజేపీ దీన్ని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు సిసోడియా. బాధితులపై కూడా క్రూరమైన జోకులు వేయగల సామర్థ్యం ఆ పార్టీకి మాత్రమే ఉందని ఫైరయ్యారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో ఉన్నారు.