Advertisement
ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వలన మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. వాట్సాప్ ద్వారా మనం ఒకరికి ఫోటోలను పంచుకోవచ్చు. వీడియోలని పంచుకోవచ్చు. అలానే మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు ఇలా మనకు నచ్చినవి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ వలన చాలా పనులు ఈజీ అవుతాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజుల్లో వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. ఇటీవల నుంచి మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే పక్కన బ్లూ పర్పుల్ రౌండ్ రింగ్ కనబడుతుంది. ఇది ఎందుకని మీరు ఆలోచించారా..? అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకు వస్తోంది.
Advertisement
తాజాగా మరో అద్భుతమైన ఫీచర్ ని తీసుకొచ్చింది కృత్రిమ మేధస్సు మనుషుల ఉద్యోగాలను దూరం చేస్తోంది. అయినా కూడా ఈ కృత్రిమ మేధస్సు కారణంగా అనేక పనులు ఈజీ అవుతున్నాయి. అదే సదుపాయం ఇప్పుడు వాట్సాప్ లోకి వచ్చింది ఈ కృత్రిమ మేధస్సును ఉపయోగించి మీరు ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. అలానే మీరు కోరుకున్నట్లుగా చిత్రాన్ని రూపొందించొచ్చు. ఏ అంశంలోనైనా ప్రశ్నలు అడిగితే మెటా సమాధానం చెబుతుంది.
Advertisement
Also read:
ముందుగా మీరు వాట్సాప్ లో ఉన్న ఆ రౌండ్ ఐకాన్ పై క్లిక్ చేయాలి ఒక చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏఐ ని ప్రాంప్ట్ చేస్తారు. ఏఐ మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. మీరు కాశ్మీర్ అందాలని చూడాలని అనుకుంటే అక్కడ టైప్ చేస్తే బ్యూటిఫుల్ కాశ్మీర్ ఫోటోలు వస్తాయి వాటిని మీరు కావాలంటే డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు మీరు చూడాలనుకున్న ప్రదేశాలు ఏమైనా వంటకాలు వంటి అంశాలను కూడా అక్కడ మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఇలా సూపర్ ఫీచర్ ఇప్పుడు వాట్సప్ లోకి వచ్చింది ఏఐ ప్లాట్ఫామ్ ను ఆశ్రయించక్కర్లేదు. డైరెక్ట్ గా మీరు వాట్సాప్ నుండి ఏఐ ని ఉపయోగించొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!