Advertisement
అమరావతి రైతులు పాదయాత్ర ప్రారంభం సమయం నుంచి రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు కారణం అయింది. కొన్ని ప్రాంతాల్లో ఈ యాత్ర సాగుతున్న సమయంలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ యాత్రకు పోటీగా మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు-నల్ల బెలూన్లతో నిరసనలు కనిపించాయి. ఇక, ఇప్పుడు యాత్ర కొనసాగింపుకు తాత్కాలిక బ్రేక్ ఇస్తూ నిర్వహకులు నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
ఈ తరుణంలో అమరావతి రైతుల పాదయాత్ర పై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఇక వారి పాదయాత్ర కొనసాగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. విజయనగరంలో మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ, అమరావతి రైతుల పేరుతో చేస్తున్న పాదయాత్ర ఆగిపోయినట్లుగా తాను భావిస్తున్నానని అన్నారు. ఈ పాదయాత్రను టిడిపి వెనక ఉండి నడిపిస్తోందని ఆరోపించారు మంత్రి బొత్స. పాదయాత్రలో ఎంతమంది ఉన్నారు? అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు అడిగిందన్నారు.
Advertisement
600 మందితో వస్తున్న పాదయాత్రలో 60 మంది కూడా రైతులు లేరని ఆయన ఆరోపించారు. ఆ పాదయాత్రలో అసలైన రైతులు లేరని, టిడిపి ముసుగులో ఉన్న అమరావతి రైతులు తమ పాదయాత్రను ఆపేసారని పేర్కొన్న బొత్స, విశాఖ పరిపాలన రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సకారం అయినట్టేనని అన్నారు. త్వరలోనే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామన్నారు. వచ్చే నెలలో భోగాపురం ఎయిర్ పోర్ట్, గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష, విశాఖ పరిపాలన రాజధాని ఇక సకారం అయినట్లేనని అన్నారు మంత్రి బొత్స.
READ ALSO : Google : గూగుల్ కు మరో షాక్, భారీ జరిమానా విధింపు!