Advertisement
భారత్ వెస్టిండీస్ పర్యటన లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ డొమినికా లోని విండ్సర్ పార్క్ లో అవుతున్న విషయం తెలిసిందే. అయితే వెస్టిండీస్ టాస్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ ని ఎంపిక చేసుకుంది. తొలి రోజు తొలి సెషన్‌లో భారత బౌలర్లు ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. వెస్టిండీస్ 68 పరుగులకే నాలుగు వికెట్లు ని ఈ సెషన్ లో కోల్పోవాల్సి వచ్చింది. అలీక్ ఇథనోజ్ ఫస్ట్ మ్యాచ్ ఇది. 13 పరుగులతో నాటౌట్ అయ్యాడు.
Advertisement
14 పరుగుల వద్ద జెర్మైన్ బ్లాక్‌వుడ్ అవుట్ అవ్వడం జరిగింది. రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్నప్పుడు మహ్మద్ సిరాజ్ బాల్ ని క్యాచ్ పట్టుకున్నాడు. ఇదిలా ఉంటే దాని కంటే ముందు శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో రామన్ రీఫర్ (2 పరుగులు) తీసాడు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టి అవుట్ చేసాడు. రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ అలానే తేజ్‌నరైన్ చందర్‌పాల్ ని అవుట్ చేసాడు.
Advertisement
ఇదంతా ఇలా ఉంటే హైదరాబాదీ బౌలర్ సిరాజ్ మాత్రం సూపర్ క్యాచ్ పట్టాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపొయింది. పైగా క్యాచ్ తీసుకుంటున్న క్రమంలో మోచేతికి చిన్న గాయమైంది. కానీ అద్భుతమైన క్యాచ్ ని మాత్రం పట్టేసాడు. జడేజా ఆఫ్-స్టంప్ పై విసిరిన బాల్‌ను బ్లాక్‌వుడ్ భారీ హిట్ కోసం వెళ్లినా… ఫలితం లేదు. మిడ్-ఆఫ్ వైపు గాల్లోకి లేచిన బంతిని సిరాజ్ వెనుకకు పరిగెత్తుతూ గాల్లోకి డైవింగ్ చేసి సూపర్ క్యాచ్ అందుకున్నాడు.
MOHAMMAD SIRAJ… YOU BEAUTY!
What a screamer, excellent catch.pic.twitter.com/iAFMvHtUFl
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2023
Also read: