Advertisement
జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒక్కసారైనా లవ్ ను ఫీల్ అవుతారు. ప్రేమించిన వాళ్ళ ఎదుట ఎక్స్ప్రెస్ చేశారా? ప్రేమపక్షంలో తిరిగారా? పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్నది పక్కన పెడితే, అందరి విషయంలో ‘లవ్’ మాత్రం కామన్. అయితే లవ్ లో ఉన్నవాళ్లు ముఖ్యంగా అబ్బాయిలు ఏవేవో ఆలోచిస్తుంటారు.
Advertisement
అవి కరెక్టో? కాదో? తెలిసే వయసు కాదు. దీంతో అవి బెడిసి కొట్టి ఆ ప్రేమ పటాపంచలవుతుంది. కొన్నిసార్లు గొడవలకు దారితీస్తుంది. మరికొన్నిసార్లు జీవితాలనే తారుమారు చేస్తుంది. అయితే అబ్బాయిలు మాత్రం మర్చిపోయి కూడా లవర్ దగ్గర ఇలా ప్రవర్తించకండి. ఈ తప్పుల వల్ల రిలేషన్ షిప్ దూరం అవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!
#ఈ తప్పుల వల్ల రిలేషన్ షిప్ దూరమవుతుంది
#ఇతర అమ్మాయిలతో ఎక్కువగా కలిసిపోకండి
Advertisement
అందరూ కాదు, కానీ చాలామంది అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయిని ఆలరించడం, మాట్లాడడాన్ని ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో మీ స్నేహితుల సర్కిల్ లోని ఇతర అమ్మాయిలతో ఫ్రాంక్ గా ఉండడానికి ప్రయత్నిస్తే అది మీ స్నేహితురాలిని బాధపెడుతుంది. కావున మీరు రిలేషన్ షిప్ లో ఉన్నట్లయితే దీనికి దూరంగా ఉండాలి.
#గౌరవం
పురుషుడైన, మహిళలైన అందరికీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పొగడకపోయినా కనీసం ఎదుటివారి ముందు అవమానించకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలాసార్లు మీకు తెలియకుండానే ఇతరుల ముందు ఏదో ఒకటి మాట్లాడడం వల్ల మీ భాగస్వామి అవమానం కలగవచ్చు. అలాంటి తప్పులు మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి. కావున మీ భాగస్వామిని తప్పనిసరిగా గౌరవించండి.
#చిన్నపిల్లల చర్యలు
రిలేషన్ షిప్ ప్రారంభంలో, అమ్మాయిలతో స్నేహం చేసే సమయంలో చిన్న పిల్లల చేష్టల కారణంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇలాంటి చర్యల వల్ల వారికి బాధ కలిగించే అవకాశం ఉంది. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ప్రతి అమ్మాయి తన భాగస్వామి పరిపక్వ ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు పురుషులు చేసే చిన్న పిల్లల చేష్టల కారణంగా కూడా సంబంధం అర్ధాంతరంగా ముగుస్తుంది.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?