Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే అభిమానులకి వెయ్యి వోల్టేజ్ కరెంటు శక్తి వచ్చినట్లు ఉంటుంది. అందరికీ అభిమానులు ఉంటారు.. కానీ పవన్ కళ్యాణ్ కి భక్తులు ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు జనసేన పార్టీని స్థాపించి ప్రజలకు తన వంతు సాయం చేస్తూ రీల్ హీరో గానే కాకుండా రియల్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పాత్రపై కూడా ఈ మధ్య చాలా చర్చలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికలు పవన్ కళ్యాణ్ కెరియర్ లో చాలా కీలకం కానుంది. వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య హోరాహోరీ పోరు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. భవదీయుడు భగత్ సింగ్ చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత సినిమాల నుండి విరామం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Advertisement
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడయినా ప్రారంభం కానున్నందున ప్రస్తుతానికి ఎన్నికలపైనే దృష్టి పెట్టి ముందు సాగిపోతున్నారు పవర్ స్టార్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి కాబోయే సీఎం కావాలని పలువురు కోరుకుంటున్నారు. ఇదే విషయంలో 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయమని బ్రహ్మం గారి కాలజ్ఞానం జోస్యం చెప్పారు. అయితే ఈ విషయంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్ సీఎం ఎలా అవుతారు అని కామెంట్ చేయడంతో.. పండితులు ఆయన జాతకరీత్యా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్న.. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా తెర మీద బొమ్మలు రాజ్యాన్ని ఏలుతాయని వీరబ్రహ్మేంద్రస్వామి గారి కాలజ్ఞానం ఆధారంగా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వటం ఖాయం అంటూ చాలా దృఢంగా చెబుతున్నారు.
Also read :
అంబానీతో పెళ్ళికి ముందు నీతా అంబానీ ఆ పని చేసేవారట ! ఆమె జీతం ఎంతంటే ?
“OG” గ్లిమ్ప్స్ లో ఇది ఎంత మంది గమనించారు ?? నిర్మాతలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే ?