Advertisement
మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం పాత్ర లేని సినిమా అంటూ ఉండదు. గత ఐదు సంవత్సరాల క్రితం ఏ సినిమాలోనైనా ఈయన కామెడీ లేకుండా సినిమాలే వచ్చేవి కావు. చాలా మంది దర్శక, నిర్మాతలు కూడా తప్పక బ్రహ్మానందం కామెడీ కావాలని డేట్స్ కోసం వేచి చూసి మరీ సినిమాల్లో పెట్టుకునేవారు. ముఖ కదలికలతోనే కామెడీని చూపించే శక్తి ఉన్న స్టార్ కమెడియన్ ఆయన. అయితే తాజాగా బ్రహ్మానందం పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పోలప్రగడ జనార్దన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
చాలా ఏళ్ల క్రితం సినిమాల్లో అందరూ కమెడియన్స్ కి మంచి అవకాశాలతో ఈవీవీ, జంధ్యాల గారి సినిమాల వల్ల ఎంతోమంది కమెడియన్స్ వచ్చారన్నారు. అలాంటి సమయంలోనే బ్రహ్మానందంతో క్లాష్ వచ్చి వారందరూ కలిసి 20 మంది కమెడియన్స్ ఏవీఎస్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ కి నేను వెళ్లలేదు.
Advertisement

Read also : Ponniyin Selvan PS1 Movie Review : పొన్నియన్ సెల్వన్-1 మూవీ రివ్యూ




