Advertisement
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో ఏదైనా ఓ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇట్టే వైరల్ అయిపోతుంది. దీంతో కొందరు ఏదైనా కనిపించనా లేదా అరుదైన వింత సంఘటన కనిపించిన వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి మంచి కామెంట్లు లైకులు వస్తుంటే, మరికొందరికి మాత్రం నెగిటివ్ కామెంట్లు మరియు ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.
Advertisement
READ ALSO : విమానాల్లో ప్రయాణం చేసేప్పుడు ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు ఉంచాలి ? లేకుంటే ఏమి జరగుతుంది ?
అయితే తాజాగా పెళ్లి మండపంలో ఇద్దరు నూతన వధూవరులు చేసిన వింత పనికి సోషల్ మీడియాలో తిట్లు మరియు నెగటివ్ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ వివాహ వేడుకకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పెళ్లి వేడుకలో నూతన వధూవరులు కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వైరల్ వీడియోలో వధువుకు వరుడు స్వీట్ తినిపిస్తూ కనిపించాడు. స్వీట్ తినడం ఇష్టం లేకో ఏమో దాన్ని తినేందుకు పెళ్లికూతురు అయిష్టత చూపింది.
Advertisement
కానీ దాన్ని పట్టించుకోని పెళ్లికొడుకు స్వీట్ ను వధువు నోట్లో కూక్కాడు. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లికూతురు అతని చెంప చెల్లుమనిపించింది. ఇది ఊహించని వరుడు ఆమెపై పిడుగుద్దులు కురిపించాడు. ఇద్దరు ముష్టి ఘాతాలతో రెచ్చిపోవడంతో కళ్యాణమండపం కాస్త మల్ల యుద్ధ మైదానాన్ని తలపించింది. జుట్టు పట్టుకుని, మెడను తోసుకొని వీళ్ళు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఈ గొడవను ఆపేందుకు అక్కడున్న వారు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఈ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022
READ ALSO : రాజమౌళి, అయన భార్య రామా రాజమౌళి ఎందుకు పిల్లల్ని వద్దని అనుకున్నారంటే ?