Advertisement
పెళ్లంటే నూరేళ్లపంట. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. నేటి సమాజంలో పెళ్లంటే మూడు రోజుల ముచ్చటగా మారిపోయింది. కొన్ని జంటలు పెళ్లయిన కొన్ని రోజులకే విడిపోతున్నారు. ఈ జంట మాత్రం పెళ్లైన రోజే షాక్ ఇచ్చింది. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. ఉదయం పెళ్లి చేసుకునే జంట మధ్యాహ్నంకి ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు. 24 గంటల్లో నూతన వధూవరులు చనిపోయారు.
Advertisement
ఈ దారుణ ఘటన కర్ణాటక కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది. కోలార్ జిల్లాకు KGF ఫోటోలు చంబరసనహళ్లిలో చోటు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. పెళ్ళికూతురు లిఖిత శ్రీ స్వస్థలం ఆంధ్రప్రదేశ్. పెళ్ళికొడుకు చంబరసనహళ్లికి చెందిన వ్యక్తి. పెద్దల సమక్షంలో నిన్న ఉదయం వీళ్ళ పెళ్లి జరిగింది. పెళ్లి వేడుక ఘనంగా చేశారు బంధువుల మిత్రుల సమక్షంలో సాంప్రదాయపదంగా వీళ్ళ పెళ్లి జరిగింది.
Advertisement
Also read:
Also read:
గదిలోకి వెళ్లిన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏమైందో తెలియదు కానీ ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అనంతరం ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన అటు కర్ణాటక ఇటు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!