Advertisement
అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు విన్నప్పుడు మనం షాక్ అవుతాం.. మనం వింటేనే షాక్ అయ్యాం.. అలాంటిది అనుభవించిన వారు ఎలా బాధపడతారో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది.. వారికి పెళ్లయి ఆరు సంవత్సరాలు అవుతోంది.. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.. చివరికి అతను పెళ్లి చేసుకున్న భార్య సొంత చెల్లి అని తెలిసి ఆ వ్యక్తి కంగుతిన్నాడు.. దీనికి సంబంధించిన విషయాన్ని రెడ్డిట్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది..ఆ వ్యక్తి చెప్పిన విషయం ప్రకారం.. పుట్టినప్పుడే అతని తల్లిదండ్రులు వేరే వాళ్లకు దత్తత ఇచ్చారు.. ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు..
Advertisement
Also Read:లీకేజ్ మంటలు.. కాంగ్రెస్ ఫిర్యాదుపై గవర్నర్ ఏం చేయనున్నారు?
కానీ ఆరు సంవత్సరాల క్రితం ఒక మహిళను వివాహం చేసుకున్నాడు.. ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే అతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయాలని అన్నారు. వెంటనే కిడ్నీ దాతల కోసం ఆమె కుటుంబ సభ్యులతో పాటు తన కుటుంబీకులు ఎవరనే విషయం కనుగొనేందుకు భర్త ప్రయత్నాలు చేశాడు. కానీ భార్య తరపు కుటుంబీకులతో ఎవరికి కిడ్నీ కూడా ఆమెకు సెట్ అవలేదు. ఈ సందర్భంలో చివరకు తన కిడ్నీ మ్యాచ్ అవుతుందని చూడమని చర్చల కోసం శాంపిల్స్ ఇచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు షాక్ అయ్యారు. భార్యాభర్తల కిడ్నీ మ్యాచ్ అయింది .
Advertisement
Also Read:చిరంజీవి జారుమిఠాయాపై మోహన్ బాబు రియాక్షన్ ఎలా ఉందంటే..?
వైద్యులు ఈ విషయాన్ని అతనికి ఫోన్ చేసి చెప్పగా షాక్ అయ్యాడు. దీని తర్వాత మరికొన్ని టెస్ట్ నిర్వహించగా అనూహ్యంగా అతని కిడ్నీ తన భార్య కిడ్నీతో అసాధారణ రీతిలో మ్యాచ్ అయింది. అప్పుడే వీరిద్దరు అన్నా చెల్లెలు అని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి భర్త కంగుతున్నాడు. ఇన్నాళ్లు సంసారం చేస్తూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది సొంత చెల్లితోనా అనుకొని వాపోయాడు. రెడ్డిట్ లో ఈ వ్యక్తి షేర్ చేసిన స్టోరీ పై నేటిజన్స్ స్పందించారు.. తెలియక చేసిన పని, మీరు ఇంతకుముందు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో మునుముందు కూడా అలాగే సంతోషంగా ఉండండి. మీ పిల్లలకు గొప్ప తల్లిదండ్రులుగా ఉండండి అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: తీన్మార్ మల్లన్నపై పెట్టిన సెక్షన్లు ఇవే!