Advertisement
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసిన కేసీఆర్.. రాష్ట్రానికి వచ్చిన జాతీయ నేతలకు రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ టూర్ ను వారు జీవితంలో మర్చిపోకుండా చేయాలన్నదే కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకే రోజంతా ఫుల్ బిజీగా ఉండేలా ప్లాన్ చేశారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో మొదలై.. సాయంత్రం సభ పూర్తయ్యే వరకు జాతీయ నేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Advertisement
Advertisement
అయితే.. వీరందరికీ తెలంగాణ వంటకాలను రుచి చూపించాలని కేసీఆర్ ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. మొత్తం 38 రకాల వంటకాలను సిద్ధం చేయిస్తున్నారు. వాటిలో 17 రకాలు నాన్ వెజ్, 21 వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. దాదపు 500 మంది కోసం ఈ వంటకాలను ప్రిపేర్ చేయిస్తున్నారు.
ఖమ్మం సభలో చేస్తున్న వంటకాలు ఇవే!
– మటన్ బిర్యానీ
– చికెన్ దమ్ బిర్యానీ
– ప్రాన్స్ బిర్యానీ
– కొరమీను కూర
– తెలంగాణ స్టైల్ మటన్ కూర
– నాటుకోడి కూర
– తలకాయ ఇగురు
– బొమ్మిడాయల పులుసు
– బోటీ ఫ్రై
– మటన్ లివర్ ఫ్రై
– పచ్చిపులుసు
– పనీర్ బటర్ మసాలా
– మెతీ చమన్
– దాల్ తడ్కా
– బీరకాయ శనగపప్పు
– బెండకాయ కాజు ఫ్రై
– ముద్దపప్పు
– బచ్చలకూర
– మామిడికాయ పప్పు