Advertisement
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే.. రెండోరోజు ములుగులో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రగతి భవన్ నక్సల్స్ పేల్చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ములుగులో రేవంత్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే.. దీనిపై రేవంత్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు.. హైదరాబాద్ లో డీజీపీ కార్యాలయానికి వెళ్లారు.
Advertisement
ప్రగతి భవన్‌ను పేల్చివేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కలిసి డీజీపీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలని కోరారు. రేవంత్ పై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ కు కూడా విజ్ఞప్తి చేస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో అభివృద్ధి పనులపై కూడా తప్పుగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
కాంగ్రెస్ పార్టీ మృత్యుశయ్యపై ఉందని.. సీనియర్లను కాదని ఓ బ్లాక్ మెయిలర్ ను పీసీసీ అధ్యక్షుడుగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు పల్లా. ములుగులో గిరిజన యూనివర్సిటీపై కూడా రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వర్సిటీ ఏర్పాటుకు భూమిని సేకరించిన అనంతరం సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వర్సిటీ భూమి, భవనాల వివరాలు ఇస్తామని.. దానిపై కేంద్రాన్ని ప్రశ్నించమని రేవంత్ కు సూచించారు రాజేశ్వర్ రెడ్డి.
మరోవైపు రేవంత్ రెడ్డి ఈ అంశంపై తగ్గేదే లేదంటున్నారు. ప్రగతి భవన్ గోడలు కూల్చుతామని హెచ్చరించారు. ములుగులో తాను మాట్లాడిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలు తనపై కేసులు పెడుతున్నారని.. ప్రగతి భవన్ అనే గడిలోకి సామాన్యులకు ఎందుకు ప్రవేశం లేదని నిలదీశారు. పార్టీ ఫిరాయింపులకు, కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందని ఆరోపించారు. ఇటు సీతక్క కూడా ఇలాగే మాట్లాడారు. రేవంత్ వ్యాఖ్యలను సమర్ధించారు.