Advertisement
టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల వేదికలపై మాట్లాడిన స్పీచ్ లు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడైతే రాజకీయాల్లో మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లోకి దిగి, కోటలు దాటే మాటలతో నవ్వుల పాలయ్యాడు.
Advertisement
అలాగే బండ్ల గణేష్ టాలీవుడ్ లో బడా నిర్మాతగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ప్రతి రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇక ఆయన స్పీచ్ లు, అందులో ఉండే ప్రాసలు, పేల్చే బుల్లెట్లు మాటలతుటాలకు అందరూ ఫిదా అవుతుంటారు. పవన్ కళ్యాణ్ భక్తుడు అంటూ గణేష్ ఇచ్చే స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. బిఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కారు బండ్ల గణేష్. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని చెప్పుకున్న బండ్ల గణేష్ రంజిత్ రెడ్డి వెనుక ఉన్నానంటూ ప్రకటించారు.
Advertisement
రంజిత్ రెడ్డి లేకుండా తాను ఆత్మహత్య చేసుకునే వాడిని అంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి పాదాలకు తాకి నమస్కరించారు బండ్ల గణేష్. రంజిత్ రెడ్డి లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని. రంజిత్ అన్న దేవుడితో సమానం. నేను ఏ పార్టీలో లేను. కానీ, రంజిత్ రెడ్డి అన్న వెనుక ఉన్నాను. అని బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక బండ్ల గణేష్ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్ బిఆర్ఎస్ లో చేరాడని కామెంట్స్ చేస్తున్నారు.
Read also: ప్రభాస్ ఎందుకు హెయిర్ క్యాప్ పెడుతున్నాడు..?