Advertisement
తెలుగు జానపదాల్లో ఓ సామెత ఉంది. పడవ ఉన్నంత వరకు పడవ మల్లన్న అంటారు.. తీరా ఆ పడవ పోయి, అవసరం తీరాక బోడి మల్లన్న అంటారు అని. ఇలాంటి సామెతలు రాజకీయాల్లో బాగా కనిపిస్తూ ఉంటాయి.
Advertisement
నేటి రాజాకీయాలను చూస్తే అవసరార్ధ మిదం ధర్మం అన్న సూక్తిని సృష్టించాలని అనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. నచ్చితే అందలం ఎక్కించడం.. లేదంటే పక్కన పెట్టేయడం రాజకీయాల్లో పరిపాటిగా జరిగే విషయమే. ఇక కేసీఆర్ కూడా కొందరు రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఇలానే వ్యవహరిస్తారన్న టాక్ ఉండనే ఉంది.
రాజకీయంగా బలంగా ఉన్నవారిని తన పార్టీలోకి అవకాశం ఇచ్చి రప్పించుకుని, మర్యాదలు చేసి.. తనకు పోటీగా మారే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు వారిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇప్పటికే ఈటెల, ప్రొఫెసర్ రాజేందర్, కోదండరాం వంటి వారి విషయంలో ఇది జరిగిందని చాలా మంది అనుకుంటున్న మాట.
పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి వారి విషయంలో కూడా పార్టీలో చేర్చుకునే వరకు అత్యుత్సాహం చూపి తరువాత పక్కన పెట్టారనే టాక్ కూడా వచ్చింది. తాజాగా పొన్నాల లక్ష్మయ్య విషయంలో కూడా ఇదే జరగబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Advertisement
ప్రస్తుతం పొన్నాల లక్ష్మయ్య విషయంలో కూడా బిఆర్ఎస్ పార్టీ చూపిస్తున్న మర్యాద అలాంటిదే అని అంతా అనుకుంటున్నారు. బిసిలకు కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతోంది అన్న విషయాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పొన్నాల లక్ష్మయ్యను ఓ అస్త్రంగా వాడుకోనున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ లో కీలక హోదాలలో పని చేసిన లక్ష్మయ్యకు కాంగ్రెస్ తగిన మర్యాద ఇవ్వలేదని.. కాంగ్రెస్ లో బిసిలు అన్యాయం అవుతున్నారని అందరికి అర్ధం అయ్యేలా చెప్పడం కోసమే.. ఆయనను తమ పార్టీలోకి రావాలి అంటూ కేటీఆర్ లక్ష్మయ్య ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారని తెలుస్తోంది. ఉన్నట్లుండి పొన్నాల పై ఇంత ప్రేమ, మర్యాద పుట్టడానికి కారణం ఇదే అయ్యుండవచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరిన్ని తెలుగు రాజకీయ వార్తల కోసం ఇక్కడ మీరు చదవచ్చు ! తెలుగు న్యూస్ కోసం అయితే ఇక్కడ చదవండి !