Advertisement
సుంకిశాల , SLBC కి లింక్ చేస్తూ..బీఆర్ఎస్ సోషల్ మీడియా రాజకీయాలు మొదలు పెట్టింది. రెండు కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాజెక్టులు అని, రేవంత్ ఫెయిల్యూర్ ప్రాజెక్టులు అంటూ తమ అతి తెలివి తేటలను ప్రదర్శించాయి. ఇదంతా చెప్తూ.. ఇలాంటి సమయంలో రాజకీయాలు పక్కన పెట్టాలని సన్నాయి నొక్కులు నొక్కారు. అసలు విషయం ఏంటంటే..సుంకిశాల ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో మొదలు పెట్టాలనుకున్న ప్రాజెక్టు. అందులో డౌట్ లేదు. 2012లో టాటా కన్సల్టెన్సీకి డీపీఆర్ తయారీ పనులు అప్పగించింది. 840కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది.కానీ,అప్పటి నల్గొండ ఎంపీ గుత్తా వ్యతిరేకించడంతో ఈ ప్రాజెక్టు కొంత కాలం వరకు పట్టాలెక్కలేదు. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును టెకోవర్ చేసింది. టాటా కన్సల్టెన్సీ ఇచ్చిన డీపీఆర్ ను పక్కన పెట్టేసి.. వాటర్ బోర్డు అధికారి నేతృత్వంలో మార్పులు చేసి డీపీఆర్ రెడీ చేశారు. డీపీఆర్ లో పేర్కొన్న స్థలంలో కాకుండా మరో చోట ప్రాజెక్టు నిర్మించారు.2021లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించారు. అంచనా వ్యయం రెండింతలకు పైగా పెంచి..2200కోట్లకు పెంచేశారు. పనులు వేగం పుంజుకోలేదు. నత్తనడకన కొనసాగాయి.2023 ఎన్నికల ముందు హడావిడి చేశారు. నాణ్యత లేమి కారణంగా 2024 ఆగస్ట్ 2న రిటైనింగ్ వాల్ కూలిపోయింది.
Advertisement
Advertisement
ఈ ప్రాజెక్టు పనులు బీఆరెస్ హయాంలో ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు స్థలిని మార్చింది బీఆర్ఎస్. రిటైనింగ్ వాల్ కూలడంతో ఇది రేవంత్ నిర్లక్ష్యం వల్లే అంటూ సోషల్ మీడియా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. నిర్మాణ సంస్థ మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ ఘటన సందర్బంగా ఈ ప్రాజెక్టు పనికిమాలినదని..కేసీఆర్ గతంలోనే ఈ విషయం చెప్పారని గొప్పగా చెప్పుకుంటున్నారు. మొదటి దఫాలో కేసీఆర్ ఈ ప్రాజెక్టును విస్మరించినా..సెకండ్ టర్మ్ లో కొంత కదలిక తీసుకొచ్చింది నిజం. అడపదడపా పనులు చేపట్టినా 2021 తర్వాత పనులు పూర్తిగా పక్కనపెట్టేసింది. బీఆర్ఎస్ పనులు పక్కన పెట్టడంతో సీపేజ్ పెరిగింది. ఇన్నేళ్లలో సీపేజ్ పెరిగి ప్రస్తుత ప్రమాదానికి కారణం అయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజా ఘటనతో దీన్ని కేసీఆర్ ఎప్పుడో విఫల ప్రాజెక్టుగా చెప్పారని, కేసీఆర్ మాటలను వినకపోవడమే ప్రస్తుత ప్రమాదానికి కారణమని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే సెకండ్ టర్మ్ లో ప్రాజెక్టు పనుల్లో ఎందుకు కదలిక తీసుకువచ్చినట్లు? అదే సమయంలో సుంకిశాల పనులు ఎవరి హయాంలో మొదలయ్యాయి? దీనికి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏం సమాధానం చెప్తుంది? ఇదంతా కేటీఆర్ నే కాదు..కేసీఆర్ ను సైతం ఇరుకున పెట్టేదే.
అయితే, ఈ విషయం కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా హైలెట్ చేయలేకపోతుంది. ఫలితంగా రేవంత్ ఈ రెండు ఘటనలకు బాధ్యుడిగా చూపే విషయంలో బీఆర్ఎస్ పదింతలు పైమెట్టుపై ఉంది. టన్నెల్ ప్రమాద బాధితులను రక్షించేందుకు ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టింది. NDRF, సింగరేణి యంత్రాంగాన్ని మొహారించి, రెస్క్యూ ఆపరేషన్ ను ముమ్మరం చేసింది. ఇప్పుడు రాజకీయాలు అప్రస్తుతం. ప్రతి ఘటనలో రాజకీయాలు వెత్తుకుంటున్న బీఆర్ఎస్..ఈ సమయంలోనూ సూచనలు, సలహాలు చేయకుండా పాలిటిక్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం ఏ రాజకీయానికి నిదర్శనమో..పైగా..కాంగ్రెస్ గట్టిగా కొడితే బీఆర్ఎస్ ఇరుకున పడే అవకాశం ఉంది..దాన్ని ఎందుకు ఉటంకించడం లేదో ..