Advertisement
టీడీపీ హయాంలో అమరావతికి జై కొట్టిన వైసీపీ.. అధికారంలోకి రాగానే మాట మార్చింది. మూడు రాజధానులు అంటూ వివాదానికి ఆజ్యం పోసింది. వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి అంటూ చెబుతూ వస్తోంది. అయితే.. మూడు రాజధానుల అంశం ప్రకటనలకే పరిమితం అయింది. అయినా, తమ స్టాండ్ మాత్రం ఇదేనని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక తాజాగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బెంగళూరులో నిర్వహించిన రోడ్ షోలో దీనిపై మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని అంశంపై మంత్రిని పెట్టుబడిదారులు పలు రకాల ప్రశ్నలు అడిగారు. విశాఖపట్నంపైనే ఎందుకు దృష్టి పెట్టారని ప్రశ్నించారు. పారిశ్రామిక గ్రోత్ ఏరియాగా తిరుపతి, విజయవాడలను ఎందుకు ఎంచుకోలేదని ఆర్థిక మంత్రి బుగ్గనను పెట్టుబడిదారులు ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి, ఐటీ పరిశ్రమలు, సంబంధిత పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందంటూ సమాధానం ఇచ్చారు.
Advertisement
Advertisement
విశాఖలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అక్కడితోనే ఆయన ఆగలేదు. తమ ప్రభుత్వం ఏపీ తదుపరి రాజధానిగా విశాఖనే నిర్ణయించిందని చెబుతూ సీఎం జగన్ కే షాక్ ఇచ్చారని చెప్పాలి. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారమని కొత్త వాదన తెలిపాయికి తెచ్చారు. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచి నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మరి దీనిపై సీఎం జగన్ కానీ మంత్రులు కానీ ఏం చెబుతారో చూడాలి. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నాయి. తాజాగా మంత్రి కామెంట్లతో కొత్త చిక్కులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.విమర్శల సంగతి ఎలా ఉన్న మంత్రి ఇంకా ఏమన్నారంటే, రాష్ట్ర విభజన తర్వాత పాలనా రాజధానిగా విశాఖనే ఎంచుకోవడానికి కారణం, అతి తక్కువ వ్యయంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనేనని తెలిపారు.
Also Read:AP-TG లో బాహుబలి నుండి వాల్తేరు వీరయ్య వరకు అత్యధిక గ్రాస్ వసూళ్లు చేసిన సినిమాలు..!