Advertisement
ఈసారైన టి20 వరల్డ్ కప్ గెలవాలన్న ఆశతో టీమిండియా ఉంది.. కానీ ఇంతలోనే ఆశలు అడియాశలయ్యాయి.. నిప్పులపై నీరు పడ్డట్టు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయంతో బాధపడుతూ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ బూమ్రా ఇద్దరు గాయాలతో టోర్నీకి దూరమయ్యారు.. మ్యాచ్ లో కీలకమైన సమయాల్లో సమయస్ఫూర్తితో ఆడుతూ ఎంతటి మ్యాచ్ నైనా మలుపు తిప్పగల కీలక ప్లేయర్లు లేకుండా టి20 వరల్డ్ కప్ ఆడనుంది ఇండియా.. ఈ తరుణంలో అభిమానుల నుంచి అసహనం వ్యక్తం అవుతోంది.. వీరు లేకుండా ఆరు జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ గెలవలేని జట్టు.. ఇప్పుడు వరల్డ్ కప్ ను గెలుస్తుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.. ఇలాగైతే టీమిండియాను కాపాడే వారు ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు..
Advertisement
హర్షత్ పటేల్, హర్ష దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టి20 వరల్డ్ కప్ కు ఎంపికైన మిగతా ఆటగాళ్లు.. మరి చివరి వరకు వీరైన అందుబాటులో ఉంటారా లేదా అన్నది క్రికెట్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న.. దీనికి ప్రధాన కారణం బూమ్రా సంఘటనే.. నిన్నటి వరకు బూమ్రా ఉన్నాడు అనుకుంటే.. ఇవాళ అతను లేడు గాయంతో దూరమయ్యాడు.. దీంతో భారత బౌలింగ్ చాలా వీక్ అయిపోయింది.. ఈ తరుణం లో గాయపడ్డ బుమ్రా ప్లేస్ లో షమిని అయినా జట్టులోకి తీసుకోవాలని అభిమానులు అనుకుంటున్నారు.. కనీసం ఆ ప్లేయర్ నైనా జట్టులోకి తీసుకుంటే ఎలాగైనా కాపాడతాడని అభిమానుల నమ్మకం.. ఒకవేళ టైటిల్ గెలవకపోయినా సరేగాని కనీసం ఇండియా పరువు కాపాడతారని కొంతమంది విమర్శకుల వాదన..గత సంవత్సర కాలంగా టి 20 కి ఎంపిక చేయకుండా ఉన్నటువంటి బీసీసీఐ ప్రస్తుతం అలాంటి సాహసం చేస్తుందా అన్నది చూడాలి..
Advertisement
also read మీరు నాన్ వెజ్ తింటున్నారా.. అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?
ఒకవేళ షమిని తీసుకోకుంటే, గాయాలతో ఆరు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న దీపక్ ని మిగిలినటువంటి మ్యాచుల్లో ఆడించి, ఈ మెగా పోరుకు సిద్ధం చేయాల్సి ఉంటుంది.. సాధారణంగా అయితే ప్రపంచ కప్ కు ఐదు నెలల ముందే జట్టు వారి యొక్క ప్లేయర్స్ ను ఖరారు చేస్తుంది.. దీని కోసం ముందే కొన్ని మ్యాచ్లను కూడా ఆడిస్తుంది. కానీ ఈసారి మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉంది.. ఆసియా కప్ లో విఫలం అయిన తర్వాత భారత్ జట్టులో మార్పు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగక పోగా మ్యాచ్ లో కొత్త బౌలర్లను కూడా బరిలోకి దింపుతున్నారు.. దీంతో కెప్టెన్, కోచ్ ల ప్లానింగ్స్ ఏంటో ఎవరికి కూడా అంతుచిక్కడం లేదు. ఇన్ని అనివార్య కారణాలతో ఇండియా జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందా లేదా అనే ప్రశ్నకు ముందు ముందు సమాధానం దొరుకుతుంది.
also read:హీరో సుమన్ భార్య బ్యాక్ గ్రౌండ్..ఆమె ఆ ప్రముఖుడి కూతురని మీకు తెలుసా..?