Advertisement
టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. యార్కర్ బాల్స్ వేయడంలో ఇతను దిట్ట. అయితే, టి20 ప్రపంచ కప్ 2022 కు ముందు ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికా తో సిరీస్ తో పాటు పొట్టి ప్రపంచ కప్ కు దూరం అయ్యాడు. అయితే ఇప్పుడు బుమ్రా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చేందుకు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
Advertisement
తన వర్కౌట్ లకు సంబంధించిన వీడియోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అంతా సులభమే కాదు కానీ ఎల్లప్పుడూ విలువైనది అంటూ ఆర్ ట్విట్ కు క్యాప్షన్ పెట్టాడు ఈ ఫాస్ట్ బౌలర్. వచ్చే ఏడాది ఆరంభం లో ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ కు బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ బౌలర్ లేని లోటు t20 ప్రపంచ కప్ లో స్పష్టంగా కనిపించింది. ఇంగ్లాండ్ తో సెమీఫైనల్స్ లో భారత బౌలర్లు కేవలం ఒక్క వికెట్ కూడా పడగొట్ట లేకపోయారు. దీంతో 10 వికెట్ల తేడాతో టీమిండియా అవమానకర రీతిలో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.
Advertisement
కాగా ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లో బుమ్రా చివరగా ఆడాడు. ఆ తర్వాత గాయపడటంతో, సౌత్ ఆఫ్రికా తో సిరీస్ కు మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేశారు. టి20 ప్రపంచ కప్ కు మాత్రం మహమ్మద్ షమీ ని తీసుకున్నారు. బుమ్రా లేకపోవడంతో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఇక అటు బుమ్రా… ఈ ఏడాది జులై లో బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రీ షెడ్యూల్ ఐదో టెస్ట్ కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడంతో సిరీస్ డ్రాగా ముగిసింది.
Never easy, but always worth it 💪 pic.twitter.com/aJhz7jCsxQ
— Jasprit Bumrah (@Jaspritbumrah93) November 25, 2022
read also : రోహిత్ శర్మ నుంచి అది కూడా లాగేసుకుంటా – సూర్య కుమార్ యాదవ్