Advertisement
త్రిపురాంతకం మండలం మేడపి వద్ద గుంటూరు హై వే పై ఓ ప్రైవేట్ బస్సు ను లారీ ఢీ కొట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇరవై మంది తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ దుర్ఘటనలో మరణించిన వ్యక్తి పేరు మానస. ఆమె మార్కాపురంలో తల్లితండ్రులతో కలిసి నివసిస్తున్నారు. మానస విజయవాడలో ఫిజియోథెరపీ కోర్సు చదువుతున్నారు. వినాయక చవితి సందర్భంగా పండుగ చేసుకోవడం కోసం మార్కాపురం వద్దకు వచ్చారు.
Advertisement
ఐవి కూడా చదవండి: ఆడవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా తమ భర్తల వద్ద దాచిపెడతారట.. అవేంటంటే?
ఐవి కూడా చదవండి: బిల్ గేట్స్ మరియు జెఫ్ బెజోస్ లాంటి సక్సెస్ ఫుల్ పీపుల్ వీకెండ్స్ లో ఏమి చేస్తారో తెలుసా?
Advertisement
పండగ బాగా చేసుకుని.. తిరిగి కాలేజీకి వెళ్లడం కోసం మంగళవారం రాత్రి మార్కాపురంలో ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ బస్సు ఎక్కారు. అయితే.. ఆ బస్సు త్రిపురాంతకం వద్ద అదుపు తప్పింది. డివైడర్ ను ఢీకొని ఓ పక్కగా ఆగిపోయింది. అయితే.. ఎవరికీ ఎలాంటి గాయాలు తగలేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మానస అక్కడే అనంతపురం-గుంటూరు హై వే లో విజయవాడ మీదుగా వెళ్లే మరో ప్రైవేట్ బస్సుని ఎక్కారు. ఈ బస్సునే లారీ ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం జరిగింది.
ఐవి కూడా చదవండి: డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా..? భర్త జైలులో ఉండి ఇబ్బందులు పడుతుంటే.. రీల్స్ చేస్కుంటూ ఎంజాయ్ చేస్తోందిగా..
ఈ దుర్ఘటనలో మానస ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఈమె ఒక్కరే ప్రాణాలు కోల్పోగా., మరో ఇరవై మంది ప్రయాణికులు గాయాల పాలై చికిత్స తీసుకుంటున్నారు. అసలు మొదటిసారి ప్రమాదం జరిగినప్పుడే మానస విజయవాడకు వెళ్లే బస్సు ఎక్కకుండా ఇంటికి వచ్చేసి ఉంటె బాగుండేదని ఆమె తల్లి తండ్రులు బాధపడుతున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని వినుకొండలో ఆసుపత్రిలో జాయిన్ చేసారు. మానస మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం యర్రగొండపాలెం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.