Advertisement
మన డైలీ లైఫ్ లో కొన్ని పదాలను వాడుతూ ఉంటాం. అయితే ఆ పదాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఒక్కో పదాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడతారు. మరి ఇందులో ఏ పదం కరెక్టు ఏ పదం రాంగ్ అన్నది కూడా మనకు తెలియదు. మనకు తెలియకుండానే వాటిని పలుకుతూ ఉంటాం. మరి వాటిని పలికేటప్పుడు మనం పలికేది కరెక్టా కాదా అనే సందేహం ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది. మనం తెలుగులో చిత్రం అంటాం. కానీ ఇంగ్లీషులో మూవీ, మరియు ఫిలిం అని పిలుస్తారు.
Advertisement
మరి ఇందులో ఏది కరెక్టు.. ఏది కాదు అనేది ఇప్పటి వరకు ఎవరు కూడా ఆలోచించలేదు కదూ. కొంతమందేమో మూవీ కి వెళ్తున్నాం అంటూ చెబుతారు. కొంతమందేమో ఫిల్ము కి వెళ్తున్నాం అంటుంటారు. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఒకసారి చూడండి. ఇవే కాకుండా మరిన్ని పదాలు కూడా ఉంటాయి. నిజానికి యుఎస్ ఇంగ్లీష్ ప్రకారం మూవీ అని పిలుస్తారు. యూకే ఇంగ్లీష్ ప్రకారం ఫిలిం అని పిలుస్తారు. కానీ ఈ రెండింటికి మీనింగ్ ఒకటే. అలాంటి పదాలు ఇంకొన్ని ఉన్నాయి.
Advertisement
-యూఎస్ లో ఫస్ట్ ఫ్లోర్- యూకే లో గ్రౌండ్ ఫ్లోర్.
-యూఎస్ లో వెకేషన్ – కానీ యూకేలో హాలిడే
-యూఎస్ లో షెడ్యూల్ – కానీ యుకెలో టైం టేబుల్
-యూఎస్ లో క్యాబ్ – కానీ యూకేలో టాక్సీ
-యూఎస్ లో స్టోర్- కానీ యుకెలో షాప్
-యూఎస్ లో క్యాండీస్ – కానీ యుకెలో స్వీట్స్
-యూఎస్ లో ట్రక్- యూకేలో లారీ
ఈ విధమైన పదాలు వాడుతూ ఉంటారు. ఈ పదాలను మన దేశంలో కూడా మొత్తం కలిపి వాడతారు. కానీ మనం ఇది ఎప్పుడూ గమనించలేదు.