Advertisement
భారతదేశంలో ఉన్న హిందువులలో ప్రతి ఒక్కరికి గోత్రం అనేది ఉంటుంది. ఇందులో ఏ కులానికి సంబంధించి వారికి సపరేట్ గా గోత్రం అనేది ఉంటుంది. మరి అసలు గోత్రం అంటే ఏమిటి అది ఏవిధంగా వచ్చిందో ఓ సారి చూద్దాం..?పూర్వ కాలంలో విద్య నేర్పించడానికి కొన్ని కుటుంబాలకు గురువులు ఉండేవారు.
Advertisement
Also Read: Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 15.07.2022
ఆ కుటుంబాలకు ఆ గురువు పేరు ఒక గోత్రము లా ఉండేది. విద్యను అభ్యసించే వారు వారి యొక్క పూర్వీకుల పేరును గోత్రంగా చేసుకునే వారు. ఈ విధంగా ప్రతి కుటుంబానికి గోత్రం ఏర్పడింది. ఇందులో ఒకే గోత్రం కలిగి ఉన్నటువంటి వారు వివాహం చేసుకోవడానికి హిందూ సాంప్రదాయం ఒప్పుకోదు. ఎందుకంటే ఒకే గోత్రం కలిగి ఉన్నవారు అన్న చెల్లెలు అవుతారని శాస్త్రం చెబుతోంది. హిందూ సనాతన ధర్మం ప్రకారం రక్త సంబంధీకులు వివాహం చేసుకోకూడదని, ఒకే గోత్రం ఉన్న వారు అన్నా చెల్లి, అక్క తమ్ముడు వరుసలు అవుతారని, కొంతమంది పరిచయం లేకున్నా గోత్రాల విషయానికి వచ్చినప్పుడు ఒకే విధంగా ఉంటాయి.
Advertisement
వీరికి ఎప్పుడో ఎక్కడో ఒక దగ్గర సంబంధం అనేది కలిసి ఉంటుంది. అందువల్ల గోత్రం కలిసినప్పుడు, కొన్ని ఏళ్ళ కిందట అయినా వారి రక్త సంబంధం కలిగి ఉంటుంది. అందువల్లే గోత్రాలు కలిసి ఉన్నప్పుడు వివాహాలు చేసుకోరాదని హిందూ శాస్త్రం మరియు పెద్దలు అంటుంటారు. కాబట్టి ఒకే గోత్రం కలిగినటువంటి వారు వివాహం చేసుకోవడానికి ఒప్పుకోరు. ఇప్పటికీ భారతదేశంలో గోత్రం నీయామాల మీద ఆధారపడే వివాహాలు అనేవి జరుగుతూ ఉన్నాయి.
also read: