Advertisement
ఈ రోజుల్లో ఆహారపు అలవాట్ల నుండి వస్త్రధారణ వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. ఎక్కువ మంది ఆడవాళ్లు ఇంట్లో ఉన్నప్పుడు, నైటీలను మాత్రమే వేసుకుంటున్నారు. కంఫర్ట్ గా ఉంటుందని నైటీలనే వేసుకోవడం మొదలుపెట్టారు. ఇదివరకు రోజుల్లో నైటీలను కేవలం రాత్రిళ్ళు మాత్రమే వేసుకునేవారు. కానీ ఈ రోజుల్లో ఉదయం పూట కూడా నైటీలనే చాలా మంది వేసుకుంటున్నారు. అయితే నైటీలు వేసుకోవడం తప్పుకాదు. నైటీలను వేసుకోవచ్చు కానీ స్త్రీ సుమంగళిగా కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా నిండుగా దుస్తులు ధరించాలి.
Advertisement
బయటకు వెళ్ళినప్పుడు మనం హుందాగా రకరకాల నగలన్ని పెట్టుకొని తయారై వెళుతూ ఉంటాము. ఇంట్లో ఉన్నప్పుడు సాదా సీదా బట్టలు కట్టుకుంటూ ఉంటాము. పూజ చేసుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. పూజ చేసుకునేటప్పుడు చాలా మంది నైటీ వేసుకుని పూజ చేసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. అయితే నిజానికి నైటీ వేసుకుని పూజ చేసుకోవడం మంచిది కాదు. అలా చేయడం వలన పాపం వస్తుంది.
Advertisement
పూజ చేసుకునేటప్పుడు సుహాసినిలా తయారవ్వాలి. అప్పుడు పూజ చేసుకోవాలి. మహిళలు చేతికి గాజులు, కాళ్ళకి పసుపు, పట్టీలు, మెట్టెలు పెట్టుకోవాలి. జడకి పూలు ఇవన్నీ పెట్టుకునే స్త్రీలు పూజ చేసుకోవాలి. అలా పూజ చేసుకోవాలే తప్ప స్త్రీలు ఎప్పుడూ కూడా ఏక వస్త్రం తో నైటీలతో పూజ చేసుకోవడం మంచిది కాదు. నైటీ వేసుకుని పూజ చేయడం వలన పాపం వస్తుంది తప్ప ఎటువంటి పుణ్యం కూడా లభించదు. కాబట్టి ఈ పొరపాటు అస్సలు చేయకుండా చూసుకోండి.
Also read: