Advertisement
ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. దాని వలన ఇది వరకు నటించి మళ్లీ కనపడని నటులు కూడా వెలుగులోకి వస్తున్నారు. ఎంతోమంది ఇండస్ట్రీకి నటులు అవ్వాలని వస్తూ ఉంటారు. అయితే అందరూ అనుకున్నంత మాత్రమే ఈజీగా అవకాశాలను పొంది మంచి పేరు తెచ్చుకోలేరు. కొంతమంది హీరోయిన్లు కానీ హీరోలు కానీ కేవలం ఒకే ఒక సినిమాతో తార స్థాయికి చేరుకుంటుంటారు. ఒక్క సినిమాతోనే ఎన్నో ఆఫర్లని పొందుతూ ఇండస్ట్రీలో స్థిరంగా నిలబడిపోతారు.
Advertisement
కానీ కొందరు మాత్రం పలు సినిమాలు చేసి తర్వాత ఇండస్ట్రీలో కలిసి రాక సినిమాలని విడిచిపెట్టి మరో దారి చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న ఆమె మాత్రం ఒక సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత సినిమాలకి దూరమయ్యారు. తాజాగా ఈ నటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ పెద్ద టాప్ హీరోయిన్. కేవలం ఒక్క సినిమా ఆమె ని దక్షిణ భారతదేశం అంతటికి తెలియజేసింది. ఆమె ఒకే ఒక్క సినిమాతోనే పాపులర్ అయింది. పెళ్లి కానీ కుర్ర కారు మొత్తానికి కలల రాకుమారి అయిపోయింది కూడా.
Advertisement
ఇక మరి ఆమె ఎవరో మీరు గుర్తుపట్టారా..? ఆమె ఎవరో కాదు గీతాంజలి హీరోయిన్. గీతాంజలి మూవీ తో అలరించి అందరిని ఆకట్టుకుంది గిరిజ. ఆ సినిమాలో ఆమె చెప్పిన ఒకే ఒక డైలాగ్ తో అందరు ఆమె వైపు చూసేలా చేసింది. యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమాలో గిరిజ హీరోయిన్గా నటించింది. మణిరత్నం దర్శకత్వంలో గీతాంజలి సినిమా తెర మీదకు వచ్చింది. అమాయకపు నటనతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది. గిరిజ కన్నడ సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చింది.
Also read: