Advertisement
ప్రస్తుత బిజీ ప్రపంచంలో కనీసం రోజుకోసారైనా ప్రకృతిని ఆస్వాదించేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారని చెప్పవచ్చు. ఇక పెద్దపెద్ద పట్టణాల్లో ఈ సమస్య మరీ ఎక్కువైంది.దీంతో చాలామంది కాస్త రిలాక్స్ కావడానికి ఏసీలనే ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. ఏసీలో ఉంటే తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు కానీ అనర్ధాలు కలిగిస్తుందని చాలామంది గ్రహించలేకపోతున్నారు. మరి ఏసీ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read: కమెడియన్ రఘు ఇల్లు చూశారంటే దిమ్మ తిరిగిపోద్ది..!!
శ్వాస సంబంధిత సమస్యలు:
కొంతమంది కార్ డోర్స్ మూసి ఉన్నటువంటి ఏసీల్లో ఎక్కువసేపు గడపడం వల్ల అందులో ఉండే సూక్ష్మజీవులు ఎటు వెళ్లలేక అక్కడే తిరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. దీంతో శ్వాస సంబంధమైన వ్యాధులు తలెత్తుంటాయి. కాబట్టి ప్రతి మనిషి రెండు గంటలకు ఒకసారి అయినా మామూలు వాతావరణంలో గడపాలని అంటున్నారు వైద్య నిపుణులు.
Advertisement
వడదెబ్బ :
కొంతమంది ఎక్కువ సమయం ఏసీలో ఉండటం వల్ల ఎప్పుడైనా ఓసారి బయటి వాతావరణంలోకి వస్తే ఎండవేడిని తట్టుకోలేక వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం ఏసీలో గడిపే వారికి తేమా వాళ్ల చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్యలు ఉన్నవారు మశ్చరైజేషన్ వాడితే మంచిది.
also read: కృష్ణవంశీ రమ్యకృష్ణ ల మధ్య లవ్ సెట్ అయింది ఆ కమెడియన్ వల్లేనా..?
తీవ్రతల నొప్పి:
కొంతమంది ఎక్కువసేపు ఏసీలో పనిచేయడం వల్ల పని ముగిసే సమయానికి తీవ్రమైన తలనొప్పి, అలసటతో బాధపడుతున్నారట. ఎక్కువసేపు ఏసీ కారణంగా, చలి వల్ల కండరాలకు తగినంత రక్త ప్రసరణ జరగక అలసట వస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు.
also read: