Advertisement
రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో మామూలుగా భార్యాభర్తల మధ్య వచ్చే జోక్స్ మనం చదువుతూనే ఉంటాం. వాటిలో కొన్ని నిజ జీవితంతో సంబంధం లేకపోయినా కూడా ఫన్నీగా అనిపిస్తాయి. ఇప్పుడున్న అన్ని రకాల జోక్స్ లో భార్యాభర్తల జోక్స్ చాలా పాపులర్. ఈ జోక్స్ అన్నీ అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినవే, చూసినవే. వీటిని చూస్తే మనం అస్సలు నవ్వు ఆపుకోలేము. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల జోక్స్ ని చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో కూడా పెడుతున్నారు. అలా ఒక భార్య తన పుట్టింటికి వెళుతూ భర్తకి కొన్ని విషయాలు మెసేజ్ రూపంలో చెప్పింది. ఈ మెసేజ్ కనక మీరు చూశారంటే అస్సలు నవ్వు ఆపుకోలేరు. ఆ మెసేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
Read also: విడాకుల తర్వాత సమంత తన తాళి బొట్టును ఏం చేసిందో తెలుసా?
• ఇంట్లో పార్టీలు లాంటివి పెట్టొద్దు. ఇల్లు శుభ్రం చేయడానికి నాకు రెండు రోజుల సమయం పడుతుంది.
Advertisement
• ఉదయాన్నే పక్కింటి వాళ్ళని పాలు వచ్చాయా, పేపర్ వచ్చిందా అని లేపి విసిగించకండి. వాళ్లు మిమ్మల్ని తిట్టడంతో పాటు, ఊరెళ్ళి వాళ్ళ నిద్ర చెడగొడుతున్నందుకు నన్ను కూడా తిట్టుకుంటారు.
• నేను ఊరు నుండి తిరిగి వచ్చేవరకు మన పనిమనిషి పనిలోకి రాదు. వాళ్ల అమ్మ మాత్రమే పనిలోకి వస్తుంది.
• ఇంటర్నెట్ రావట్లేదని కంప్లైంట్ ఇవ్వద్దు. ఫోన్ పట్టుకుంటే అర్ధరాత్రి అయినా తెలియడం లేదని ఇంటర్నెట్ ని నేనే కట్ చేయించాను.
• నేను మళ్ళీ తిరిగి వస్తానన్న విషయాన్ని మర్చిపోవద్దు.
• అద్దం ముందు గంటల తరబడి రెడీ కాకండి. మీరు తొందరగా పని చేసుకోవాలని టైం కొంచెం ఫాస్ట్ గా పెట్టాను. ఆ సమయాన్ని మీరు ఫాలో అవ్వండి.
• కళ్ళజోడు బాత్రూంలో పెట్టి మర్చిపోకండి.
• పోయినసారి లాగా స్టవ్ ఎన్నిసార్లు వెలిగించిన వెలగడం లేదు అని టెన్షన్ పడి నాకు ఫోన్ చేయకండి. ఈసారి వెలిగించే ముందు స్టవ్ ఆన్ చేయడం మర్చిపోకండి.
Read also: “ఓజీ” సెట్స్ లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!