Advertisement
పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అదే ఆలస్యం. ఫలితంగా అనుకున్నదేది వర్కవుట్ కావడం లేదు. నగరం నడిబొడ్డున జరుగుతున్న ఫార్ములా ఈ రేసింగ్ లో నెలకొన్న గందరగోళం ఇది. తొలిరోజు క్వాలిఫయింగ్ పోటీలు జరపకుండా రెండు ప్రాక్టీస్ సెషన్స్ తోనే సరిపెట్టారు. ఆదివారం అన్ని పోటీలను నిర్వహించే అవకాశం ఉంది.
Advertisement
రెండు కార్లు రేస్ మధ్యలో ఆగిపోయాయి. దీంతో రెండుసార్లు రెడ్ ఫ్లాగ్స్ వచ్చాయి. గతంలో మాదిరిగానే మరోసారి రేస్ నిర్వహణ ఆలస్యమైంది. దీనికి తోడు వర్షం కూడా అడ్డంకిగా మారింది. రేస్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మెయిన్ రేస్ 1 జరపలేదు. ఆదివారం లీగ్ లోని మూడు రేస్ లు ఉండనున్నాయి.
Advertisement
శనివారం ఉదయం 11 గంటలకు పోటీలు జరగాల్సి వుండగా వరుణుడు అడ్డుతగిలాడు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత రెండు కార్లు ఆగిపోవడం.. సాంకేతిక కారణాలతో చాలా ఆలస్యంగా స్పోర్ట్స్ కార్లు ట్రాక్ పైకి రావడంతో ఏం చేయలేని పరిస్థితి. దీంతో ఆదివారం కీలకంగా మారనుంది.
తొలిరోజు రేసింగ్ ను చూసేందుకు అభిమానులు తక్కువ సంఖ్యలో వచ్చారు. క్వాలిఫయింగ్ మ్యాచ్ ల నేపథ్యంలో ఆదివారం భారీగా రావొచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు.