Advertisement
పిల్లల విషయంలో తల్లిదండ్రుల తప్పిదాలు అనడం కంటే పొరపాట్లు అన్నది సబబుగా ఉంటుంది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అయినా పిల్లల విషయంలో తప్పుగా ప్రవర్తించరు.. కొన్ని విషయాలలో పొరపాట్లు చోటు చేసుకుంటాయి. పిల్లల అవసరాల విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకుండా ఉండవచ్చు.. కానీ వారి కోరికల వల్ల జరిగే పరిణామాలు ఆలోచించి ముందుకు సాగాలి. ఇక వాహనాల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు. అవి మన జీవితానికి కోలుకోలేని దెబ్బతీసే యమపాషాలుగా అవుతాయి.
Advertisement
Read also: మసూద మూవీలో దయ్యం పట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?
అలాగే వాహనాలపై వెళుతున్నప్పుడు చిన్న పిల్లలను ముందు కూర్చోబెడితే వారిపై ఓ కన్నేసి ఉంచాలి. లేదంటే ప్రమాదాలు తప్పవు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ వీడియోలో ఓ ఇంటి ముందు స్కూటర్ పై తండ్రి, తన బిడ్డతో కలిసి బయటకి వెళ్లడానికి కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఇంట్లో నుంచి అతని భార్య ఏదో వస్తువు తెచ్చి ఇస్తోంది. అంతలోనే ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆ స్కూటీ ముందు బాగాన నిల్చుని ఉన్న కుర్రాడు ఒక్కసారిగా ఎక్స్ లెటర్ ఇచ్చాడు. దాంతో స్కూటీ ముందుకు దూసుకెళ్లింది. స్కూటీ అదుపుతప్పడంతో బాలుడు కింద పడిపోగా.. స్కూటీ పై ఉన్న వ్యక్తి వెనక్కి ఎగిరిపడ్డాడు.
Advertisement
ఆ స్కూటీ పైనుంచి పడిన తండ్రికి గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోని వివేక్ గుప్తా అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ లో జరిగినట్లు వీడియోని బట్టి తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్కూటీ ముందు పిల్లలను కూర్చోబెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read also: రైల్వే ప్లాట్ఫామ్ మీద అంచున ఉండే ఈ పసుపు రంగు లైన్ ను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా..?
जब बच्चा स्कूटी पर हो तो, स्कूटी को रोकने के बाद उसका इंजन जरूर बंद करे..
नही तो यह घटना आपके साथ भी हो सकती है.
महाराष्ट्र के सिंददुर्घ की घटना..@News18India pic.twitter.com/VYrNeRnynQ
— Vivek Gupta (@imvivekgupta) December 19, 2022