Advertisement
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుండడం కలకలం రేగింది. పైగా మూడు రోజులపాటు పవన్ ను వారు వెంబడిస్తున్నట్లుగా జనసేన నేతలు చెబుతున్నారు. సోమవారం నుంచి వరుసగా మూడు రోజులు కొందరు వ్యక్తులు తిరుగుతున్నారని.. వాళ్లను చూస్తుంటే అభిమానులులా అనిపించడం లేదని అంటున్నారు.
Advertisement
సోమవారం రాత్రి సెక్యూరిటీ సిబ్బందితో గొడవ కూడా పడ్డారు. దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది పవన్ టీమ్. మూడు రోజులుగా కొంతమంది వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన జన సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేతకు ప్రాణహని ఉంది చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
పవన్ ఇంటికి ఎదురుగా కారు ఆపిన ఆగంతకులు.. సెక్యూరిటీ, సిబ్బంది వారించగా బూతులు తిడుతూ, పవన్ కళ్యాణ్ ని దుర్భాషలాడుతూ గొడవ చేశారు. సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. అయినా సంయమనం పాటించిన సిబ్బంది.. ఈ సంఘటనను వీడియో తీసి జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్ కి అందించారు. ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై జనసేన ప్యాక్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ ఇంటి వద్ద గొడవ చేశారని చెప్పారు. సెక్యూరిటీతో కావాలనే గొడవపడ్డారని.. సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టేలా చేశారని వివరించారు. మంగళవారం పవన్ ను కొందరు బైక్ పై అనుసరించారని… అలాగే బుధవారం కారుతో వెంబడించారని చెప్పారు. వరుసగా మూడు రోజులు రెక్కీ నిర్వహించడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు నాదెండ్ల.