Advertisement
మన చిన్నతనంలో ఆకాశం వైపు చూసినప్పుడు పైభాగంలో గుండ్రంగా తిరుగుతూ రాబందుల అనేవి కనిపించేవి. కానీ ప్రస్తుత కాలంలో రాబందులను చూద్దామంటే కూడా ఎక్కడా కనిపించడం లేదు. మరి ఈ పక్షుల సంఖ్య ఇంతలా పడిపోవడానికి కారణం ఏమిటి.. ఓ సారి తెలుసుకుందాం..? ప్రస్తుత కాలంలో మానవుడు ఎక్కువగా చెట్లను నరకడం వల్ల రాబందులు అంతరించడానికి ఒక కారణం కావచ్చు. కానీ దీనికి మరొక బలమైన కారణం ఉంది. అదే మనం వాడే పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు. అందరూ అవాక్కయ్యారు కదూ.. మీరు విన్నది నిజమే.. మనం వాడే పెయిన్ కిల్లర్ డైక్లోఫెనాక్ టాబ్లెట్ చాలా తక్కువ ధర.
Advertisement
పెయిన్ కిల్లర్స్ లో మంచి రిజల్ట్ ఇచ్చే టాబ్లెట్ కూడా ఇదే కాబట్టి ఆ మధ్యకాలంలో డాక్టర్లు కూడా ఈ టాబ్లెట్స్ ను ఎక్కువగా రాసేవారు. అయితే ప్రకృతిని క్లీన్ చేసే వాటిలో ముఖ్యమైనవి రాబందులు.ఇవి జంతువుల శవాల్ని కాకుండా మనుషుల శవాలను కూడా తింటాయి. అయితే మనుషులు డేక్లో ఫినాక్ తీసుకుంటే రాబందులకు ఏమి ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే మనిషి శవాలు చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి. కానీ జంతువులు కూడా విపరీతంగా డైక్లోఫెనాక్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ జంతువులు చనిపోయాక వాటీ బాడీని రాబందులు తినేవి.
Advertisement
అయితే ఆ జంతువుల మాంసం లో డైక్లోఫెనాక్ ఎఫెక్టు ఉండడంవల్ల రాబందులకు సైడ్ ఎఫెక్ట్స్ కలిగి వాటి కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, ఆ మాంసాన్ని తినడం వల్ల రాబందులకు మత్తుగా ఉండి, రెక్కల్లో శక్తి తగ్గిపోయి ఎగరలేక చాలా బాధలు పడేవి. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే రాబందుల గుడ్లు పలుచబడి పిల్ల రాబందులు పుట్టకముందే చనిపోయే వి.1990 లో 90 శాతం రాబందులు అంతరించిపోయాయి. దీంతో 2008లో ఇండియన్ గవర్నమెంట్ వెటర్నరీ ట్రీట్మెంట్ లో పశువులకు డైక్లోఫెనాక్ ఇవ్వకూడదని ప్రభుత్వం ఈ మందులు బ్యాన్ చేసింది.