• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telangana politics » ఏడున్నర గంటల విచారణ.. కేసీఆర్ తో కవిత భేటీ..!

ఏడున్నర గంటల విచారణ.. కేసీఆర్ తో కవిత భేటీ..!

Published on December 11, 2022 by Idris

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను విచారించారు. దాదాపు ఏడున్నర గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కవిత ఇంటికి తరలివచ్చారు. ఆమెను పరామర్శించారు. అయితే.. కాసేపటికే ఆమె తన ఇంటి నుంచి ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో సమావేశమయ్యారు.

Advertisement

ఆదివారం 11 గంటలకు సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చారు. మొత్తం రెండు వాహనాల్లో ఆరుగురు అధికారులు లోపలికి వెళ్లారు. ఈ బృందంలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. లిక్కర్ స్కాం కు సంబంధించి తమకు ఉన్న డౌట్స్ అన్నీ కవితను అడిగారు. ప్రత్యేకమైన గదిలో ఈ విచారణ కొనసాగింది. సాయంత్రం ఆరున్నర వరకు విచారించారు అధికారులు.

Advertisement

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించింది. ఈక్రమంలోనే సీబీఐ నోటీసు ఇచ్చింది. ముందుగా ఓ డేట్ అనుకున్నా.. అది కుదరలేదు. 11 డేట్ ఫిక్స్ అయి.. 11 గంటలకు విచారణకు వచ్చారు అధికారులు. నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, సమీర్ మహేంద్రు స్టేట్ మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

విచారణ ప్రక్రియ అంతా వీడియా రికార్డింగ్ ద్వారానే జరిగినట్లు సమాచారం. ఉదయం నుంచి అడ్వొకేట్ సమక్షంలో అధికారుల ప్రశ్నలకు కవిత సమాధానం ఇచ్చారని.. మధ్యాహ్నం భోజన సమయం తర్వాత అడ్వొకేట్ ను బయటకు పంపి.. కవితను మాత్రమే విడిగా అధికారులు ప్రశ్నించారని వార్తలు వస్తున్నాయి. స్టేట్ మెంట్ రికార్డు అనంతరం.. సీబీఐ అధికారులు కవిత ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు వెళ్లారు.

Related posts:

వాళ్లంతా మహేష్ బాబులే..! ఖబడ్దార్ కేసీఆర్ మాకు పెద్ద ఆశల్లేవ్.. ధర్మం కోసమే పనిచేస్తాం..! telangana bjp leaders meets amit shahబీజేపీ నేతలకు అమిత్ షా ఏం చెప్పారు?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd