Advertisement
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొదట్నుంచి వినిపిస్తున్న పేరు కవిత. కేసీఆర్ గారాలపట్టీ పేరును బీజేపీ నేతలే బయటపెట్టారు. ఆ సమయంలో ఆమె ఖండిస్తూ.. కోర్టు వరకు వెళ్లారు. అయితే.. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఆమె పేరు ఎప్పుడైతే మెన్షన్ అయిందో.. అప్పటి నుంచి అఫీషియల్ గా విమర్శల దాడి ఎక్కువైంది. తెలంగాణను దోచుకున్నది చాలదా..? ఢిల్లీపై పడ్డారు అంటూ తెగ తిడుతున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ నుంచి కవితకు పిలుపురావడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Advertisement
తెలంగాణలో సీబీఐకి ఎంట్రీ లేదు. ఎవరినైనా విచారణ చేయాలంటే.. డైరెక్ట్ గా రావడానికి అనుమతి లేదు. ఇదే సమయంలో కవితకు నోటీసులు పంపడంతో ఏం జరుగుతుందో అని అందరూ అటువైపే చూశారు. ముందుగా 6న విచారణ ఉంటుంది హైదరాబాద్ లో ఉంటారా? ఢిల్లీలో ఉంటారా? అని కవితను అడిగింది సీబీఐ. దానికి ఆమె హైదరాబాదే బెటర్ అని రిప్లై ఇచ్చారు. అయితే.. ఏమైందో ఏమోగానీ తర్వాతి రోజు యూటర్న్ తీసుకున్నారు. నోటీసులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను, ఎఫ్ఐఆర్ కాపీని తనకు ఇవ్వాలని.. అప్పుడే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడానికి వీలు ఉంటుందని రిటర్న్ లేఖ రాశారు.
Advertisement
తాను విచారణకు సహకరిస్తానని, బిజీ షెడ్యూల్ వల్ల 6న కాకుండా 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు అందుబాటులో ఉంటానని పేర్కొంటూ సీబీఐకి సమాచారం ఇచ్చారు. ఈక్రమంలో సీబీఐ నుంచి రిప్లై వచ్చింది. 11వ తేదీన అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు అధికారులు. మెయిల్ ద్వారా ఈ సమాచారం అందించారు. 11వ తేదీన హైదరాబాద్ లోని నివాసంలో 11 గంటలకు భేటీ ఉంటుందని స్పష్టం చేశారు.
మొదటి సీబీఐ అధికారులకు వివరణ ఇస్తానని పేర్కొన్న కవిత.. తర్వాత, తనపై పెట్టిన కేసు ఏంటి? దానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని, కోర్టులో తేల్చుకోవాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. సీబీఐ మాత్రం ఏ విషయంలోనూ తగ్గకుండా.. 11న కలుద్దామని కవితకు పిలుపు పంపింది.