Advertisement
రెండు మనసుల కలయికే ప్రేమ.. దీని మత్తులో పడ్డారంటే కులం,మతం, పేద, ధనిక అనే తేడాలేవీ కనిపించవు.. ఇందులో ఏ మత్తు ఉంటుందో తెలియదు కానీ ప్రేమలో పడ్డవారు చాలా గమ్మత్తుగా ఆలోచిస్తూ ఉంటారు.. ఈ ప్రేమ అనేది సామాన్య మానవుల నుంచి సెలబ్రిటీల వరకు ఒకే విధంగా ఉంటుంది.. ఇప్పటివరకు ప్రేమకు కులం అడ్డు కాదని, మతం అడ్డు కాదనే విషయాలు మనం తెలుసుకున్నాం.
Advertisement
కానీ ప్రేమకు వయస్సు కూడా అడ్డు కాదని ఈ స్టార్ సెలబ్రిటీలే నిరూపించారు.. వారి కంటే వయసులో పెద్దవారైనా అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని అన్యోన్య దంపతులుగా పేరు పొందారు. మరి వారెవరో, ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం..
సచిన్ టెండూల్కర్:
భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నో రికార్డులు సాధించిన సచిన్ టెండూల్కర్ ప్రస్తుత ధనిక ఆటగాడిగా మిగిలారు. ఈయన తనకంటే ఐదు సంవత్సరాలు పెద్దదైనటువంటి అంజలీని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి జంట ఎంతోమందికి ఆదర్శమని చెప్పవచ్చు.
మహేష్ బాబు:
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉంటారు. అలాంటి ఆయన తన తండ్రికి ఇష్టం లేకున్నా చివరికి ఎలాగోలా ఒప్పించి తనకంటే పెద్దదైనటువంటి నమ్రత శిరోద్కర్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.
సైఫ్ అలీ ఖాన్ :
Advertisement
బాలీవుడ్ స్టార్ గా ఎదిగిన సైఫ్ అలీఖాన్ కూడా తనకంటే వయసులో పెద్దదైన అమృత సింగ్ ను వివాహం చేసుకున్నాడు.
అభిషేక్ బచ్చన్:
బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన అభిషేక్ బచ్చన్ కూడా, తనకంటే రెండేళ్లు పెద్దదైన హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ని ప్రేమించి మరీ వివాహమాడారు.
శిల్పా శెట్టి :
శిల్పా శెట్టి కూడా తనకంటే చిన్నవాడైనటువంటి రాజ్ కుద్రను ప్రేమించి మరి వివాహం చేసుకున్నది.
ప్రియాంక చోప్రా:
స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన ప్రియాంక చోప్రా వివాహం చాలా ఆశ్చర్యకరం. తనకంటే 11 సంవత్సరాలు చిన్నవాడైనటువంటి నిక్ జోనస్ ను ప్రేమించి మరీ వివాహం ద్వారా ఒకటైంది.
విరాట్ కోహ్లీ :
ప్రస్తుతం స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్నటువంటి విరాట్ కోహ్లీ కూడా తనకంటే ఆరు నెలలు పెద్దదైనటువంటి అనుష్కను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.
also read: సినిమాల్లోకి బన్నీ భార్య, ఆ స్టార్ హీరో మూవీతో ఎంట్రీ అంటూ వార్తలు!