Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి స్టార్లుగా మారిన నటీనటులు చాలామంది ఉన్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా ఎవరికి వారు సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినంత మాత్రాన ప్రతి యాక్టర్ సక్సెస్ అవ్వాలి అని రూలేమీ లేదు. కానీ అలా కొంతమంది నటులకు చెందిన కుమార్తెలు మాత్రం హీరోయిన్స్ గా రాణించలేకపోయారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Read also: ఆసక్తిగా శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. దీని ఆంతర్యం ఏంటి?
1) సుప్రియ యార్లగడ్డ.
అక్కినేని కుటుంబం వారసురాలిగా ” అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి” చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది సుప్రియ యార్లగడ్డ. మొదటి సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసింది. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నాగార్జున మేనకోడలైన సుప్రియ కి ఈ చిత్రం తర్వాత అనుకున్నంత స్థాయిలో హీరోయిన్ గా ఛాన్సులు రాలేదు.
2) మంజుల.
సూపర్ స్టార్ కృష్ణ రెండవ కూతురు, మహేష్ బాబుకి చిన్న అక్క మంజుల కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అప్పట్లో బాలకృష్ణ తో ఓ సినిమా కూడా ఓకే అయింది. కానీ కృష్ణ కూతురు కాబట్టి ఆమెని వేరే వాళ్ళ పక్కన ఊహించుకోలేమని ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాలలో మంచి క్యారెక్టర్స్ చేసింది.
Advertisement
3) అక్షర హాసన్.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ రెండవ కూతురే అక్షర హాసన్. ఈమె ధనుష్ సరసన షమితాబ్ అనే సినిమాలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలలో నటించిన హీరోయిన్ గా కొనసాగలేకపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
4) నిహారిక.
మెగా ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ తనని హీరోయిన్ గా అంగీకరించలేకపోయారు ప్రేక్షకులు.
5) మంచు లక్ష్మి.
డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా పూర్తిస్థాయిలో హీరోయిన్ గా రాణించలేకపోయింది.
6) ఐశ్వర్య.
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య విశాల్ హీరోగా చేసిన ధీరుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో ఈమెకి ఛాన్సులు ఎక్కువగా రాలేదు.
Read also: కొత్త బంగారులోకం మూవీలో బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా?