Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముగిసి వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న అప్పు.. 2019 మార్చి నాటికి 2,64,451 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన అప్పులతో కలిపి 4,42,442 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు రూ.1,77,991 కోట్లు అని పార్లమెంట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం అప్పులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం అందరికీ తెలిసిందే.
Advertisement
Advertisement
టీడీపీ, జేజేపీ, జనసేన, వామపక్షాలు విపక్షాలు మొత్తం కలిపి వైసీపీ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నాయి. గతంలో టీడీపీ హయాంలో కంటే తక్కువ అప్పులు చేశామని వైసీపీ చెప్పుకొస్తున్నా.. విమర్శలు తగ్గడం లేదు. ఏపీ అప్పులపై ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి మరోసారి క్లారిటీ ఇచ్చారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై పార్లమెంట్ లో ప్రస్తావించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తుందని.. ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటి మరీ అప్పులు చేస్తుందని ఆరోపించారు. అప్పులకు సంబంధించి అసెంబ్లీకి కూడా వివరాలు ఇవ్వడం లేదని.. లోక్ సభలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులకు సమాధానం చెప్పాలని కోరారు రఘురామ కృష్ణంరాజు. ఏపీ అప్పులపై ఇప్పటికే ఓసారి క్లారిటీ ఇచ్చిన నిర్మల సీతారామన్ మరోసారి క్లారిటీ గా పార్లమెంట్ లో వివరించారు.