Advertisement
సాధారణ ఎన్నికలను తలపించిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులే సత్తా చాటారు. బీజేపీ గట్టి పోటీనిచ్చింది. అయితే.. ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆరోపించారు. ఫలితాల్లో అధికారపార్టీ అక్రమాలకు పాల్పడిందని 5 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలను తారుమారు చేశారని మండిపడ్డారు.
Advertisement
సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్లే ఓట్లేసుకుని, వాళ్లే ఫలితాలు ప్రకటించుకుంటున్నారని.. ఈమాత్రం దానికి ఎన్నికల నిర్వాహణ, ఫలితాల ప్రకటన హడావుడి ఎందుకని ప్రశ్నించారు సంజయ్. జనం సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఏముందని నిలదీశారు. అధికారం చేతుల్లో ఉందని బీఆర్ఎస్ ఇష్టానుసారం వ్యవహరించిందని మండిపడ్డారు బండి.
Advertisement
మంత్రి కేటీఆర్ మాత్రం బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెస్ ఫలితాలతో బీజేపీని ప్రజలు మరోసారి తిరస్కరించారన్నారు. అడ్డదారుల్లో గెలుపు కోసం చేసిన కుటిల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. సెస్ ఎన్నికలను సాధారణ ఎన్నికల మాదిరి మార్చి.. విచ్చలవిడి డబ్బులతో, ప్రలోభాలతో ప్రజలను మభ్య పెట్టాలనుకున్న బీజేపీ ప్రయతాలు విఫలమయ్యాయని అన్నారు కేటీఆర్. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేల్చిచెప్పారు.
15 మంది డైరెక్టర్ల కోసం జరిగిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్లే సత్తా చాటారు. వారి విరాలు ఇవే.
సిరిసిల్ల టౌన్ 1- దిడ్డి రమాదేవి
సిరిసిల్ల టౌన్ 2- లక్ష్మీనారాయణ
తంగళ్ళపల్లి- చిక్కాల రామారావు
ముస్తాబాద్- సందుపట్ల అంజిరెడ్డి
ఎల్లారెడ్డిపేట- వరుస కృష్ణహరి
గంభీరావుపేట- గౌరనేని నారాయణరావు
వీర్నపల్లి- మాడుగుల మల్లేశం
వేములవాడ అర్బన్- రేగులపాటి హరి చరణ్ రావు
వేములవాడ టౌన్- నామాల ఉమ
కోనరావుపేట- దేవరకొండ తిరపతి
రుద్రంగి- ఆకుల గంగారం
ఇల్లంతకుంట- మల్లుగారి రవీందర్ రెడ్డి
బోయిన్ పల్లి- కొట్టేపల్లి సుధాకర్
చందుర్తి-
వేములవాడ రూరల్-